https://oktelugu.com/

NRI News : అమెరికాలో ఖమ్మం విద్యార్థి దుర్మరణం

NRI News కిరణ్‌ తండ్రి లక్ష్మణ్‌రాజు గతంలోనే చనిపోయాడు. అతని తల్లి హైదరాబాద్‌లో ఉంటుంది. వీరి బాధ్యతను కిరణ్‌ తాత కృష్ణమూర్తిరాజు చూసుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం కిరణ్‌ను గతేడాది అమెరికాకు పంపించారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2024 10:39 am
    Khammam

    Khammam

    Follow us on

    NRI News : అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈతకు వెళ్లిన విద్యార్థి నీటిలో మునిగి చనిపోయాడు. ఈమేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబానికి సమాచారం అందించింది.

    ఖమ్మం జిల్లా విద్యార్థి..
    ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాథరాజు కిరణ్‌ (20) ఉన్నత చదువుల కోసం గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లాడు. మిస్సోరీ రాష్ట్రంలోని శ్యాండిల్‌ ఎస్‌టౌన్‌లో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. శనివారం వారాంతం కావడంతో మిత్రులతో కలిసి ఈతకు వెళ్లాడు.

    స్విమ్మిగ్‌పూల్‌లో మునిగి..
    ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లో దిగాడు. అయితే అది ఎనిమిది అడుగుల లోతు ఉండడంతో కిరణ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. మిగిలిన మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో కిరణ్‌ మునిగిపోతున్నట్లు గుర్తించినా ఏమీ చేయలేక నిస్సహాయులుగా ఉండిపోయారు.

    గతంలోనే తండ్రి మృతి..
    ఇదిలా ఉండగా కిరణ్‌ తండ్రి లక్ష్మణ్‌రాజు గతంలోనే చనిపోయాడు. అతని తల్లి హైదరాబాద్‌లో ఉంటుంది. వీరి బాధ్యతను కిరణ్‌ తాత కృష్ణమూర్తిరాజు చూసుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం కిరణ్‌ను గతేడాది అమెరికాకు పంపించారు. అనుకుకోకుండా ప్రమాదం జరిగి మృత్యువాత పడడంతో తల్లి, తాత కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకున్న కొడుకు మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు.