Alcazar 2021 Model Review In 2025: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో వివిధ కంపెనీలు కొత్త కొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకువచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే మార్కెట్లోకి ఎన్నో కంపెనీల కార్లు వచ్చిన కొన్ని మాత్రమే సక్సెస్ఫుల్గా విగ్రహాలు జరుపుకుంటాయి. దేశీయంగా మారుతి కంపెనీకి మంచి పేరు ఉండి ఈ కంపెనీకి చెందిన కార్లు అత్యధికంగా అమ్ముడు అవుతూ ఉంటాయి. కానీ దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Hyundai తన ప్రాధాన్యతను చాటుకుంటూ ఉంటుంది. ఈ కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు గడిచి అనేక కాలనీ విక్రయించింది. అయితే వీటిలో ఆల్కజార్ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కారు ఉత్పత్తి అయిన యూనిట్లలో 90% విక్రయాలు జరిగాయి. ఇంతకీ ఈ కారు స్పెషల్ ఏంటి అంటే?
Hyundai కంపెనీకి చెందిన ఆల్క జార్ కారు 2021 జూన్ 18న మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో SUV లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో.. అప్పటికే ఈ కంపెనీ నుంచి క్రెటా, వెన్ యు, టక్సన్, హుందాయి మోటార్ ఇండియా కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే వీటి తర్వాత ఆల్కహాల్ కారును మార్కెట్లోకి తీసుకురావడంతో దీనిపై వినియోగదారులు ఆసక్తి చూపారు. ఈ కారులో ఉండే ఫీచర్స్ తో పాటు.. వినియోగదారులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండడంతో దీని కొనుగోలుకు ఇకపడ్డారు. ఇందులో సెవెన్ సీటర్ ఉండి మహీంద్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చింది. అలాగే ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫో టైం సిస్టం తో పాటు, 8 స్పీకర్ సౌండ్ సిస్టం, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Hyundai Car : హ్యుందాయ్ బంఫర్ ఆపర్.. ఆ కారుపై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్.
ఈ ఫీచర్లకు ఆకర్షితులైన చాలామంది దీని కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో అల్కాజార్ కారు గత నాలుగేళ్లలో 1,28,419 యూనిట్లు తమ్ముడు అయ్యాయి. అంటే హుందాయి భారతదేశంలోని చెన్నై ప్లాంటులో 1,29,440 యూనిట్లు ఉత్పత్తి చేసింది. అంటే మరో 1.021 యూనిట్ల విక్రయాలు జరిగితే 100% విక్రయాలు జరిగినట్లే. ఇందులో దేశీయంగా 92,414 కార్లు అమ్మితే.. విదేశాలకు 36, 005 యూనిట్లను ఎగుమతి చేసింది. అంటే దేశీయంగా మరో 7,586 కార్లు విక్రయాలు జరిపితే లక్ష యూనిట్లకు చేరుకుంటుంది. గత నాలుగేళ్లలో 2023 సంవత్సరంలో అత్యధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాదిలో మొత్తం 38,394 యూనిట్లు ఉత్పత్తి అయితే.. 26,696 కార్లు విక్రయాలు జరిగాయి. వీటిలో 11,34 కార్లు ఎగుమతి అయ్యాయి.
ఆ తర్వాత ప్రతి ఏడాది కార్ల విక్రయాలు పెంచుకుంటూ వస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 17,132 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ప్రతి సంవత్సరం యావరేజ్ గా 20 శాతానికి పైగా వృద్ధి సాధిస్తూ వస్తుంది. కానీ ఈ ఏడాది 10 శాతం అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. మిగతా కార్లకు గట్టి పోటీనిస్తూ ఫీచర్లతో పాటు.. స్టైలిష్ గా ఉండే ఈ కార్లను కొనుగోలు చేయడం వల్లే ఈ వృద్ధి సాధించినట్టు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.