మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో ఆ ఆహారాన్ని బట్టే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు లేని ఆహారాన్ని ఎంత తీసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు మన ఆహారపు అలవాట్లే మనకు కొత్త సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. మూడు రోజుల క్రితం కరోనా బారిన పడిన ట్రంప్ లో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడానికి ఆయన ఆహారపు అలవాట్లే కారణమని తెలుస్తోంది.
ట్రంప్ ఫాస్ట్ ఫుడ్ ను అమితంగా ఇష్టపడతాడు. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని తెలిసినప్పటికీ ట్రంప్ మాత్రం ఫాస్ట్ ఫుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఆయన ఆహారపు అలవాట్లే ఆరోగ్య సమస్యలకు కారణమైనట్టు తెలుస్తోంది. ఈ ఆహారపు అలవాట్ల వల్లే ట్రంప్ బరువు పెరిగాడని సమాచారం. బరువు పెరుగడం వల్ల ట్రంప్ ఒబెసిటీతో బాధ పడుతున్నాడు.
మరోవైపు మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సర్వేల ఫలితాలు ట్రంప్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ట్రంప్ కరోనా బారిన పడటం వల్ల ఆయనకు నష్టమే తప్ప లాభం జరగదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు హెల్తీ డైట్ ఫాలో అయ్యే వాళ్లకు కరోనా సోకినా ప్రమాదం లేదని అలా కాకుండా ఫాస్ట్ ఫుడ్ కు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే ఇబ్బందులు పడక తప్పదని నిపుణులు వెల్లడిస్తున్నారు.
రెడ్ మీట్ ను ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడే ట్రంప్ ఆహారపు అలవాట్లపై గతంలో అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు కాగా బరువు 110 కిలోలు. మరి ట్రంప్ బాగానే ఉన్నానని చెబుతున్నా ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకుంటారో లేదో చూడాల్సి ఉంది.