https://oktelugu.com/

Indian Journalist: న్యూయార్క్‌లో అగ్ని ప్రమాదం.. భారతీయ జర్నలిస్ట్‌ మృతి

అమెరికా న్యూయార్క్‌ సిటీలోని ఓ అపార్టుమెంట్‌లో ఓ బైక్‌లో ఉన్న లిథియం, అయాన్‌ బ్యాటరీ పేలింది. భారీ దీంతో అగ్ని ప్రమాదం సంభవించిందని అమెరికా మీడియా తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 25, 2024 1:37 pm
    Indian Journalist

    Indian Journalist

    Follow us on

    Indian Journalist: అమెరికాలో భారతీయు మరణాలు ఆగడంలేదు. వేర్వేరు కారణాలతో రెండు నెలలుగా ఇండియన్స్‌ మృత్యువాతపడుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ భారతీయ జర్నలిస్ట్‌ మృతిచెందాడు. ఈమేరకు భారతీ రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. మృతిచెందిన జర్నలిస్టు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.

    అపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదం..
    అమెరికా న్యూయార్క్‌ సిటీలోని ఓ అపార్టుమెంట్‌లో ఓ బైక్‌లో ఉన్న లిథియం, అయాన్‌ బ్యాటరీ పేలింది. భారీ దీంతో అగ్ని ప్రమాదం సంభవించిందని అమెరికా మీడియా తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా అపార్టుమెంట్‌ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారతీయ జర్నలిస్టు ఫాజిల్‌ మృతిచెందినట్లు వెల్లడించింది. దీనిపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఫాజిల్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపింది. ఈమేరకు సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.

    డిగ్రీ చేసేందుకు వెళ్లి..
    ఫాజిల్‌ జర్నలిజంలో డిగ్రీ చేసేందుకు 2020లో న్యూయార్క్‌ వెళ్లాడు. అక్కడే ఉన్న కొలంబియా జర్నలిజం స్కూల్‌లో కోర్సు పూర్తి చేసి అక్కడే ఉంటున్నాడు. శుక్రవారం అపార్టుమెంట్‌లో మంటలు చెలరేగగా అందులో ఫాజిల్‌ మృతిచెందాడు. ఆరు అంతస్తుల భవనంలో మూడో అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. క్రమంగా మంటలు అపార్టుమెంట్‌ అంతా విస్తరించాయి. మంటల్లో చిక్కుకున్న పలువురు కిటికీల్లో నుంచి దూకి బయటపడ్డారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలికి వెళ్లలేకపోయారు. చాలాసేపటి తర్వాత లోపల చిక్కుకున్నవారిని కష్టంగా బయటకు తీసుకువచ్చారు. తర్వాత అధికారులు ఘటన స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు.

    17 మందికి గాయాలు..
    లిథియం–అయాన్‌ బ్యాటరీ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడినట్లు తెలిపారు. ఫాజిల్‌ శరీరం పూర్తిగా కాలిపోయిందని వెల్లడించింది. అతని శరీర భాగాలను భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.