https://oktelugu.com/

అమెరికా నుంచి 20వేల తెలుగు సాఫ్ట్ వేర్లు ఇంటికి

అమెరికాలో హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన దాదాపు 68వేల భారత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు 2020 మే లో స్వదేశానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే దాదాపు 20వేల మంది కావడం గమనార్హం. కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి అమెరికా ప్రతి ఏటా 85వేల హెచ్1బీ వీసాలు ఇస్తుంది. అయితే 2014 నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2014 లో వెళ్లిన వారికంటే 2015లో అమెరికా వెళ్లిన వారు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 18, 2020 / 01:01 PM IST
    Follow us on

    అమెరికాలో హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన దాదాపు 68వేల భారత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు 2020 మే లో స్వదేశానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే దాదాపు 20వేల మంది కావడం గమనార్హం.

    కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి అమెరికా ప్రతి ఏటా 85వేల హెచ్1బీ వీసాలు ఇస్తుంది. అయితే 2014 నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2014 లో వెళ్లిన వారికంటే 2015లో అమెరికా వెళ్లిన వారు రేట్టింపు అయ్యారు. ఆ విధంగా ఏటేటా తెరలు తెరలుగా ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లిన వారు దాదాపు 2లక్షల మంది. అందులో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపిటి) అర్హతతో ఉద్యోగం చేస్తున్న వారు దాదాపు 68వేలమంది. వీరికి మూడేళ్ళ కాలవ్యవధి కోసం ఇచ్చిన ఓపిటి ఈ ఏడాది మేతో ముగుస్తుంది. దీంతో ఈ 68వేల మంది స్వదేశాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.