పడకేసిన పోలవరం… ఇప్పట్లో అనుమానమే!

రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో ముందుకు సాగే అవకాశాలు కనబడటం లేదు. వాస్తవానికి 2017నే పూర్తి చేయాలని భావిరచిన ఈ ప్రాజెక్టు తరువాత 2019కి లక్ష్యంగా నిర్దేశిరచుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో దీనిని 2021 సంవత్సరానికి వాయిదా వేసుకున్నారు. అయితే అప్పటికైనా పూర్తిచేస్తారనే సంకేతాలు మాత్రం వెలువడటం లేదు. గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా స్తంభించడమే అందుకు కారణం. మాటలే తప్ప కేంద్రం నుండి నిధులు రావడం లేదు. […]

Written By: Neelambaram, Updated On : February 18, 2020 1:22 pm
Follow us on


రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో ముందుకు సాగే అవకాశాలు కనబడటం లేదు. వాస్తవానికి 2017నే పూర్తి చేయాలని భావిరచిన ఈ ప్రాజెక్టు తరువాత 2019కి లక్ష్యంగా నిర్దేశిరచుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో దీనిని 2021 సంవత్సరానికి వాయిదా వేసుకున్నారు. అయితే అప్పటికైనా పూర్తిచేస్తారనే సంకేతాలు మాత్రం వెలువడటం లేదు. గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా స్తంభించడమే అందుకు కారణం.

మాటలే తప్ప కేంద్రం నుండి నిధులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించే పరిస్థితులలో లేదు. జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించినా అందులో కీలకమైన పునరావాసం, పరిహారం వంటి వ్యయాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తాజాగా కేంద్రం మెలిక పెడుతున్నది. దానితో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం అనుమానాస్పదంగా ఉంటున్నది.

ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం పట్ల కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలలో ఎవ్వరికీ కూడా ఆసక్తి లేదని స్పష్టం అవుతుంది. పునరావాసం, పరిహారంలకే మూడొంతుల వ్యయం – రూ 35,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఆ పనులు ఇంకా వేగం అందుకోవడం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న కొద్దీ గ్రామాలలో మినహా, ముంపు గ్రామాలలో ఆ పక్రియ ఇంకా పూర్తిగా చేపట్టవలసి ఉంది.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆర్భాటం చేసినా చేసిన ఖర్చు మాత్రం స్వల్పమే. 2014-15 నురచి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఏకంగా రూ 39,000 కోట్లకుపైగా నిధులు కేటాయింపులు చేయగా, అందులో విడుదల చేసినవి కేవలం రూ 7,000 కోట్ల పైచిలుకు మాత్రమే. ఈ నిధులనే అధికారులు ఖర్చు చేయగలిగారు.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ 6863 కోట్లను బడ్జెట్‌లో కేటాయించగా, ఇప్పటివరకు కేవలం రూ 336 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మట్టి పనులు కూడా కేవలం రూ 118 కోట్ల విలువైనవి మాత్రమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా అతి తక్కువ స్థాయిలో మాత్రమే పనులు జరుగుతురడడంతో ఈ ప్రాజెక్టు వేగవంతంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.