Homeఆంధ్రప్రదేశ్‌Bhogapuram Airport Transportation Issues: భోగాపురం ఎయిర్ పోర్ట్.. విశాఖ ప్రజలకు రవాణా కష్టాలు!

Bhogapuram Airport Transportation Issues: భోగాపురం ఎయిర్ పోర్ట్.. విశాఖ ప్రజలకు రవాణా కష్టాలు!

Bhogapuram Airport Transportation Issues: మరో నెల రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించ బడునుంది. ఎప్పటికీ ప్రైవేటు ఎయిర్లైన్స్ తమ సర్వీసులను భోగాపురం నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. దాదాపు ప్రపంచ ప్రఖ్యాత ప్రైవేట్ ఎయిర్లైన్స్ తమ సర్వీస్ లను నడపనున్నాయి. కానీ విశాఖ తో పాటు నగరం అనుసంధానంగా ఉండే ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రయాణ భారం కానుంది. అంతర్గత రహదారులు ఉన్నా.. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తేనే రవాణా ఇబ్బందులు తొలుగుతాయి. లేకుంటే చాలా ఇబ్బందికరమే. 50 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో రవాణాకు రెండు గంటల సమయం పట్టి అవకాశం ఉంది. విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు మూడు నుంచి నాలుగు మార్గాలు ఉన్నాయి. అయితే ట్రాఫిక్ సమస్య దృష్టిలో ఏ మార్గంలో వెళ్లిన గంటన్నరకు పైగా సమయం పట్టి అవకాశం ఉంది. దీనిపై అధికార యంత్రాంగం కూడా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

* విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రధానంగా హనుమంతవాక, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, కొమ్మాది, మారికవలస, అనంతపురం మీదుగా భోగాపురం వెళ్లాలంటే కచ్చితంగా 1.50 గంటల సమయం పట్టనుంది.

* అదే అనకాపల్లి నుంచి భోగాపురం చేరుకోవాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. గంటన్నరలోగా చేరుకోవచ్చు. దానికి కారణం జాతీయ రహదారి ఉండడమే. 16వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. అనకాపల్లి నుంచి ఎన్ హెచ్ 16 బైపాస్ మీదుగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు..

* స్టీల్ ప్లాంట్ నుంచి బయలుదేరాలి అనుకుంటే.. విశాఖ నగరానికి టచ్ చేయకుండా లంకెలపాలెం, సబ్బవరం మీదుగా ఎన్హెచ్ 16 ఎక్కి ఆనందపురం నుంచి భోగాపురం వెళ్లడానికి 1. 40 గంటల సమయం పడుతుంది. గాజువాక నుంచి కూడా అంతే..

* విశాఖ నగరవాసులు భీమిలి మీదుగా చేరుకోవాలి అనుకున్నా గంటన్నర సమయం పడుతుంది.

* హనుమంతువాక నుంచి అడవివరం, ఆనందపురం మీదుగా భోగాపురానికి 1.40 గంటల సమయం పట్టి అవకాశం ఉంది.

* అయితేభో గాపురం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేకంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విఎంఆర్డిఏ ఏడు రహదారులను ప్రతిపాదించింది. వాటిని అందుబాటులోకి తెస్తే కానీ.. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రయాణభారం తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version