Homeప్రవాస భారతీయులుCanada : కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ శ్రీ సాయి బాబా మందిరంలో...

Canada : కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ శ్రీ సాయి బాబా మందిరంలో ఘనంగా గణపతి నవరాత్రుల వేడుకలు

Ganpati Navratri celebrations in Calgary, Canada : కెనడా కాల్గరీలోని శ్రీ అనఘా దత్త సొసైటీ గణపతి నవరాత్రుల వేడుకలు ఘనంగా జరిగాయి. లలిత , శ్రీ శైలేష్ ఆలయ నిర్మాతలు, వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ సహా ఎంతో మంది వాలంటీర్లతో వినాయకచవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గణపతిఉత్సవ ఊరేగింపు కాల్గరీ డౌన్ టౌన్ వీధిలో 400 మందికి పైగా మేళ తాళాలతో, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామ స్మరణలతో జరిపారు.

‘గణపతి ఉత్సవ ఊరేగింపు’ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఉత్సవంలో కెనడా పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన జస్రాజ్ హల్లాన్ పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను.. హాజరైన వారిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఎంపీకి, వాలంటీర్లకు శైలేష్ భాగవతుల కృతజ్ఞతలు తెలిపారు

ఉదయం నుండి జరిగిన కార్యక్రమములో జ్యోతి ప్రజ్వలన, గురువందనం, చతుర్వేద పారాయణం, వినాయక చవితి పూజలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. పంచాయతన పూజలు, యాగాలు నిత్య పూజలు అయిదు సంవత్సరాలకు పైగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకులు శ్రీమతి లలిత, శ్రీ. శైలేష్ గణపతి నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహించారు

వేద పారాయణ, నిత్య అగ్నిహోత్రం, పూజలు, యాగాల వల్ల ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కఠోర వ్యాధులు ప్రబలకుండా భగవంతుడు కాపాడతాడని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వేజనా సుఖినోభవంతు, దైవ స్మరణల తో 800 మంది భక్తులు ఆలయ సందర్శనతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది . ఈ సత్కార్యానికి దైవ సంకల్పం తో ముందుకు వచ్చారు. దైవ నమ్మకమే అన్నింటికీ గట్టి పునాది అన్నారు. కెనడా కాల్గరీ, ఎడ్ మన్ టన్ చుట్టు ప్రక్కల ప్రాంతంనుండి చాలా భక్తులు రావడం విశేషం.

శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ అనేది షిర్డీ సాయిబాబా, అనంత పద్మనాభస్వామి, అనఘా దేవి, శివుడు, హనుమంతుడు, గణేశుడు మరియు కార్తికేయ దేవతలను కలిగి ఉన్న ఆలయం. ఈ ఆలయాన్ని నిర్వహించే ఒక నమోదిత స్వచ్ఛంద సంస్థ. ఆలయంతో పాటు శాస్త్రీయ సంగీతం మరియు నృత్య కార్యక్రమాలతో సహా వివిధ సాంస్కృతిక మరియు సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి భక్తిప్రవత్తులు చాటింది.

అందరికీ శ్రీ గణేశుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని వేద పండిట్ రాజకుమార్ గారి వేద ఆశీర్వచనంతో క్రతువులు పరిసమాప్తమయ్యాయి. అతిథులకు మహా నేవేద్యం సమర్పించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version