Homeప్రవాస భారతీయులుTSCHE Chairman Professor Limbadri: ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, సెక్రటరీ కరుణకు తెలంగాణ ప్రవాసుల...

TSCHE Chairman Professor Limbadri: ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, సెక్రటరీ కరుణకు తెలంగాణ ప్రవాసుల ఘనస్వాగతం

TSCHE Chairman Professor Limbadri: లండన్ పర్యటన లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి , తెలంగాణ ఉన్నతవిద్య సెక్రటరీ మేడం కరుణ ఐఏఎస్ కి ప్రవాస తెలంగాణ వాసుల తేనేటి విందు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బ్రిటన్ తెలంగాణ వాసుల ప్రత్యేక ఆహ్వానం మేరకు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉన్నత విద్య లో నేడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్ళను , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య విభాగంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలను సుదీర్ఘంగా లింబాద్రి వివరించారు .

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని నిబంధనల ప్రకారం 1988 APSCHE ఉన్నత విద్యా మండలి స్వీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSCHE తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఏర్పాటు చేసినట్లు లింబాద్రి తెలిపారు. అంతేకాకుండా TSCHE. ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉన్నతవిద్య కోసం పెరుగుతున్న ఆదరణను దృష్టికి లో ఉంచుకొని అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు , వృత్తిపరమైనసంస్థలు స్థాపించబడ్డాయని లింబాద్రి తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో డేటా సైన్సెస్‌లో మూడేళ్ల బీఎస్సీ , బిజినెస్ అనలిటిక్స్‌లో బీకామ్ లాంటి కొత్త కోర్సులను ప్రారంభించి గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పనా లో దోహద పడుతుందని అన్నారు. విద్యార్థుల ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. ఈకార్యక్రమాలు  విద్యార్థులో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను అందించడం వారి ఉద్యోగ అవకాశాలనుమెరుగుపరచడం లక్ష్యంగా స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించి నటువంటి రిటైల్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, ఇ-కామర్స్‌కు సంబంధించిన కోర్సులను రూపకల్పన చేస్తూన్నాము అని అంతే కాకుండా విద్యార్థులకు చదువుతున్న సమయం లోనే స్టైఫెండ్ అందేలా రుపాకలప్న చేస్తున్నాము అని తెలియ చేసారు .

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్‌లు , ఆర్థిక సహాయ పథకాలనుఅందిస్తుంది. ఈ కార్యక్రమాలు అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్యను పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు . విద్యా ప్రమాణాలను నిర్వహించడం ఎప్పటికప్పిడు మెరుగుపరచడానికి అక్రిడిటేషన్ , మూల్యాంకన పద్ధతులుఉపయోగం లో ఉన్నవి అని తెలిపారు .

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇటీవలి పరిశీలన ప్రకారం, తెలంగాణలోని ఆరు రాష్ట్రవిశ్వవిద్యాలయాలలో పురుషుల కంటే మహిళల సంఖ్య నమోదు అయింది , రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్ మరియు మెడిసిన్ మినహా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చేరిన మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే 14,000 పైగాఉంది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న స్కాలర్‌షిప్‌ల , రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాల కారణాలవల్ల ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య పెరగడానికి కారణమని తెలియజేసారు. ఉన్నత విద్యలో ఏడేళ్ల క్రితంప్రబలంగా ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించ గలిగామని తెలిపారు .

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితా లో ఉన్నటు వంటి విద్య వేవస్థ ను , కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర యొక్కసూచనలను పరిగణి లోకి తీసుకోకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ని తీసుకరకడం వాళ్ళ కొత్త విద్య విధానం పై పలుసందర్భాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అని ఒక ప్రశ్నకు బదులు తెలిపారు .

తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్రటరీ మేడం కరుణ ఐఏఎస్ గారు , మన ఊరు మన బడి కార్యక్రమం నడుస్తున్న తీరును , ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు అభివ్రిద్ది ని వివరించారు . ముఖ్యమంత్రి గారు నిర్దిష్ట ప్రణళిక , లోతయినపరిజ్ఞానం వాళ్ళ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది అని తెలిపారు , తెలంగాణ రాష్ట్రము లో ఉన్న 27000 పాఠశాలలో తొలిదశలో 7000 పాటశాలలను అన్ని రకాల మౌలిక సదుపాయాలు , అంతర్జాతీయ స్థాయి తగ్గ సదుపాయాలుఏర్పరుస్తు తిరిచి దుదితున్న తీరును స్పష్టం చేసారు .

హైదరాబాద్ బావార్చి రెస్టవురంట్ ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ప్రవాసులు బావార్చి రెస్టురెంట్ యజమానులు కిశోరె మున్నాగాల , తెలంగాణ జాగృతి యూరప్ అధ్యక్షులు దన్నంనేని సంపత్ కృష్ణ , ఉస్మానియా అలుమునై యూకే యూరప్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ , తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రవణ్ గౌడ్ , పింగళి శ్రీనివాస్ రెడ్డి , ప్రముఖ న్యాయవాది కమల్ ఓరుగంటి , సురేష్ గోపతి తదితరులు
ప్రొఫెసర్ లింబాద్రి గారిని , మేడం కరుణగారిని ఘనంగా సత్కారించి ధన్యవాదాలు తెలిపారు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version