Chicago Andhra Association (2)
CAA: అగ్రరాజ్యం అమెరికా(America)లో తెలుగు సంబురాలు అంటేనే ఓ పండుగ వాతావరణం. పండుగలైనా, వేడుకలు అయినా.. ఇతర సమ్మేళనాలు అయినా ఓ పండుగలాగే ఉంటాయి. తెలుగు సంబురాలు అంటే మామూలుగా ఉండదు. ఈ వేడుకలకు అమెరికాలోని తెలుగువారంతా కచ్చితంగా పాల్గొంటారు. పిల్లలు, పెద్దలు అంతా ఎంజాయ్ చేస్తారు. తాజాగా చికాగో ఆంధ్ర అసోసియేషన్(Chicago Andhra Association) ఆధ్వర్యంలో పల్లె సంబురాలు నిర్వహించారు. లెమోంట్ ఆలయంలో ఫిబ్రవరి 8న నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగువారంతా హాజరయ్యారు. ట్రస్టీగా, మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఈ కార్యక్రమం విజయం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అధ్యక్షుడు శ్రీకృష్ణ మతుకుమల్లి, చైమాన్–శ్రీనివాస్ పెదమల్లు తెలిపారు. ఇందుకు సహకరించిన కమిటీ సభ్యులు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వెయ్యి మందికిపైగా హాజరు..
ఇదిలా ఉంటే పల్లె సంబురాల్లో సుమారు వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ ఇలాంటి వేడుకల్లో భాగస్వాములు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు ఇలాంటి వేదికలు దోహదపడతాయని తెలిపారు. నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
Chicago Andhra Association
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
ఇక పల్లె సంబురాల్లో భాగంగా అమెరికాలోని తెలుగువారు, వారి పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు(Cultaral events) అతిథులను అలరించాయి. తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు. చిన్న పిల్లల నృత్యాలు, నాటికల ప్రదర్శన, రైతుల కష్టం గురించి తెలిపే కార్యక్రమాలు, పల్లె జీవనాన్ని(Village Life Style) ప్రతిభించించే నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సభ్యత నమోదు కూడా చేపట్టారు. జ్యోతిప్రజ్వల నుంచి ముగింపు వరకు కార్యక్రమాలన్నీ తెలుగదనం ఉట్టిపడేలా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించాయి.
సేవా కార్యమ్రాల గురించి…
ఇక ఈ వేడుకల్లో సంస్థ సేవా విభాగమైన చికాగో ఆంధ్ర ఫైండేషన్(Chicago Andhra Foudation) నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, మున్ముందు చేపట్టే ప్రాజెక్టులను వివరించారు. చికాగో ఆంధ్ర ఫౌండేషన్ తరఫున ఫుడ్ డ్రైవ్, శారీ రాఫిల్, చేనేత టేబుల్ రన్నర్స్ స్టాల్ విరాళాలకు అమ్మకాలు చేపట్టారు. ముగింపు సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, తెలుగువారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డా.ఉమా ఆరమండ్ల కటికిగారు హాజరయ్యారు.
Chicago Andhra Association (3)
Chicago Andhra Association (4)
Chicago Andhra Association (5)
Chicago Andhra Association (6)
Chicago Andhra Association (7)
Chicago Andhra Association (8)
Chicago Andhra Association (9)