TANA Women’s day : నేడు మహిళలే మహారాణులు.. భువిపైనే కాదు.. అంతరిక్షంలోనూ మగువలు సత్తా చాటుతున్నారు. అందుగలరు ఇందులేరని సందేహమే వలదు. ఎందెందు వెతికినా మహిళా విజయ నినాదం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో మన మహిళా లోకం ఇప్పటికే సత్తా చాటింది.. చాటుతోంది. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(తానా)లోనూ మన మహిళలు సత్తా చాటుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తమ కళలు, సృజన, అభిరుచులు అన్నీ బయటపెట్టారు.
తానాలో ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ విశేష సేవలందిస్తూ.. అమెరికాలో, భారత్ లో సేవయే పరమావదిగా ముందుకెళుతున్నారు ఉమా ఆరమండ్ల కటికి గారి ఆధ్వరంలో ‘తానా మహిళా దినోత్సవం’ చికాగోలో అంగరంగ వైభవంగా జరిగింది. మహిళల శక్తియుక్తులు, వారి సామర్థ్యాన్ని ఉమా గారు వెలికితీశారు. ఎంతో ఉత్సాహంగా మహిళలను ఈ వేడుకలో పాలుపంచుకునేలా చేయడంలో.. మహిళలను తట్టిలేపడంలో వారి టాలెంట్‌ను ఎలుగెత్తి చాటడంలో ఉమా గారు కీలక పాత్ర పోషించారు.
తానా లాంటి తెలుగు అసోసియేషన్‌లో ‘ఉమా’ గారి సేవలు ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిని పంచుతూనే ఉన్నాయి. ఎంతో మంది మహిళలు ఉమా గారి స్ఫూర్తితో తానాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మహిళలకంటూ ఓ గుర్తింపును సంపాదించిపెడుతున్న ఉమాగారి సేవలు మరింతగా ఇనుమడింప చేయాలని.. ఆమె మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కొనియాడడం విశేషం.
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో ఉమా గారు ఉమెన్స్ కోఆర్డినేటర్‌గా ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చికాగోలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వారాంతంలో జరిగిన తానా ఉమెన్స్ డే (TANA Women’s day) సంబరాలు చికాగో మహిళలని ఆనందడోలికలలో ముంచెత్తాయి. మహిళలు ఉత్సాహంగా ఈ సంబురాల్లో పాల్గొన్నారు.
ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ప్యాజంట్ విన్నర్స్ ఎన్ఆర్ఐ గ్లోబల్ మిస్ – గౌరీ, శ్రీ మిసెస్ ఇల్లినాయ్ అమెరికన్ – రూపీ కౌర్, మిసెస్ ఇండియా ఇల్లినాయ్ – శ్వేతా చిన్నారి రాంప్ వాక్ చేయడం ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలిచింది. మిరుమిట్లు గొలుపుతున్న వేదికపై హోయలు ఒలికారు. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నోరూరించే వంటకాలు రుచిచూపించారు. మనసు దోచే చీరలు, నగలు పెట్టుకొని మహిళలంతా సందడి చేశారు..
ఇక చికాగోలో ఉన్న మహిళామణులు మహిళా దినోత్సవంలో సందడి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. లోపల జరిగే కార్యక్రమాలు ఇలా మహిళలతో కళగా ఉంటే.. బయట చీరలు వారి మనుసు దోచేలా ఉన్నాయి. వాటిని కొనేందుకు ఆసక్తి చూపించారు.
మహిళా దినోత్సవాన్ని ఉమా ఆరమండ్ల కటికి గారు ఎంతో పకడ్బందీగా ప్రణాళికతో నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని వేదికలో ఒక్కో టేబుల్ కు కళాతపస్వి కే. విశ్వనాథ్ గారి సినిమా పేర్లు పెట్టి మహిళలందరికీ సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమా పేర్లు పెట్టడంలో ఉమ గారి ఉత్తమాభిరుచికి అద్దం పట్టినట్టుంది.
అంతేకాదు చికాగో తెలుగువారు గర్వపడే మన తెలుగు మహిళలు శ్రీమతి శేషుమాంబ గారు, శ్రీమతి శారదా శొంఠి గారు , శ్రీమతి లక్ష్మీ నాగ్ సూరిభొట్ల గార్లని మహిళా దినోత్సవ కార్యక్రమ వేదికపై ఘనంగా సత్కరించారు. ఇది ఉమా గారి గొప్ప ఆలోచనకు.. పెద్దల పట్ల గౌరవానికి ప్రతిబింబంలా మారింది.
ఈ కార్యక్రమ వేదికపై హుషారుగొలిపే ఆటపాటలతో ఎంసీ ప్రణతి, పావని మొత్తం మహిళలందరినీ ఉర్రూతలూగించారు. ముగ్ధా సారీస్ వారిచ్చిన బహుమతులతో అత్యంత రుచికరమైన విందుతో ఒక పండగ వాతావరణంలో ఈ మహిళా దినోత్సవం అందరినీ ఆకట్టుకుంది.
ఇలా ఉమా ఆరమండ్ల కటికి గారి ఆధ్వర్యంలో ఉత్తమాభిరుచి తో, ఎంతో సంతోషంగా నిజమైన మహిళా దినోత్సవం అమెరికాలోని తెలుగు మహిళల మనసులో చిరస్థానం సంపాదించింది. ఉమాగారి సేవ నిరతి, మహిళల పట్ల గౌరవం.. వారి పట్ల చూపించిన చొరవకు అందరూ వేయినోళ్ల పొగిడారు. ఇలాంటి లీడర్ తమకు ఉండాలంటూ ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో ఉమాగారి స్పీచ్ మహిళలందరికీ స్ఫూర్తినిచ్చేలా వారిలో భరోసానింపేలా సాగింది. మహిళల కోసం నేనున్నానన్న భరోసాను ఆమె ప్రతి ఒక్కరిలో కలిగేలా స్ఫూర్తినిచ్చారు. మహిళల తరుఫున ఏ కష్టమొచ్చినా నిలబడుతానన్న ధీమాను పంచారు. ఈ కార్యక్రమంలో డా. సుధా ఎలమంచిలి ఎండోక్రైనాలజిస్ట్ గారు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ గురించి అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథులుగా డా. అనిందిత ఘోష్ ( చికాగోలోని కాన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన మిస్టర్ సోమ్ నాథ్ ఘోష్ గారి భార్య) మరియు బోలింగ్ బ్రూక్ మేయర్ అయిన మిసెస్ మేరి అలెగ్జాండర్ బెస్థా హాజరయ్యారు. ఇక వీరితోపాటు విశిష్ట అతిథులుగా మిసెస్ ఎన్నారై గ్లోబర్ శ్రీమతి గౌరీ శ్రీ, మిసెస్ ఇల్లినాయిస్ అమెరికన్ శ్రీమతి రూపి కౌర్, మిసెస్ ఇండియా ఇల్లినాయ్ శ్వేతా చిన్నారి ఈ కార్యక్రమాన్ని తమ చేతలతో మరింత ఆహ్లాదంగా మార్చారు. మొత్తంగా మహిళా దినోత్సవాన్ని నభూతో నభవిష్యతి అన్న తీరుగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉమా గారితోపాటు ఆమె వెన్నంటి ఉండి వాలంటీర్లు హేమ అద్దంకి, సంధ్య అద్దంకి, శ్రీదేవి దొంతి, అనిత కాట్రగడ్డ, మాధవి బత్తుల , కిరణ్ వంకాయలపాటి, శ్రీలతరావు, గురుప్రీత్ సింగ్, స్వప్న, నీరజ లంకదాసులు , వేణి శనక్కాయల కలిసి విజయవంతం చేశారు. మహిళలు, అతిథులకు ఏలోటు రాకుండా దగ్గరుండి చూసుకొని మునుపెన్నడూ లేనంత సక్సెస్ ను చేశారు.
-ఉమెన్స్ డేలో మహిళల ర్యాంప్ వాక్, ఆటపాటల వీడియోలు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Celebrated tana womens day in chicago
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com