https://oktelugu.com/

America: అమెరికాలో భారతీయులకు అరెస్ట్‌ వారెంట్‌.. కలకలం

అమెరికాలోని ప్రిన్స్‌టన్‌లో పోలీసులు 15 మంది అమ్మాయిలను ఇటీవల పట్టుకున్నారు. విచారణలో వాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయిల వెంట మగవాళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అమ్మాయిల అక్రమ రవాణాకు సంతోష్‌ కక్టూరి అని విచారణలో నిర్ధారించారు. దీంతో ప్రిన్స్‌టన్‌ పోలీసులు సీఐడీ డిటెక్టివ్‌లు సంతోష్‌ కక్టూ కోసం సెర్చ్‌ వారెంట్‌ జారీ చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 9, 2024 2:36 pm
    America

    America

    Follow us on

    America: అగ్రరాజ్యాం అమెరికాలో నలుగురు భారతీయులకు ఊహించని షాక్‌ తగిలింది. మానవ అక్రమ రవాణా కేసులో టెక్సాస్‌ పోలీసులు అరెస్టు వారెంట్లు జారీ చేశారు. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నట్లు ఇటీవల గుర్తించిన పోలీసులు అందుకు భారతీయులే కారణం అని గుర్తించారు. ఈమేరకు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేశారు.

    ఏం జరిగిందంటే..
    అమెరికాలోని ప్రిన్స్‌టన్‌లో పోలీసులు 15 మంది అమ్మాయిలను ఇటీవల పట్టుకున్నారు. విచారణలో వాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయిల వెంట మగవాళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అమ్మాయిల అక్రమ రవాణాకు సంతోష్‌ కక్టూరి అని విచారణలో నిర్ధారించారు. దీంతో ప్రిన్స్‌టన్‌ పోలీసులు సీఐడీ డిటెక్టివ్‌లు సంతోష్‌ కక్టూ కోసం సెర్చ్‌ వారెంట్‌ జారీ చేశారు.

    నకిలీ కన్సల్టెన్సీ ద్వారా..
    డల్లాస్‌కు చెందిన నలుగురు నలుగురు భారత సంతతి వ్యక్తులు కన్సల్టెన్సీ నిర్వహిస్తూ ఉద్యోగాలు, ఉపాధి పేరుతో భారతీయ యువతలను అమెరికాకు అక్రమంగా తీసుకువస్తున్నారు. ఇందుకోసం నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. అమెరికాకు వచ్చిన తర్వాత యువతులను బంధించినట్లు గుర్తించారు. ఇందుకు సంతోష్‌ కక్టూరి, అతని భార్య ప్రధాన బాధ్యులని పోలీసులు భావిస్తున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల ఎలక్ట్రానిక్స్‌ని పరిశీలించి ఆపరేషన్‌ వివరాలను పోలీసులు తెలిపారు.