TS EAPCET-2024: టీఎస్‌ ఎంసెట్‌ అలర్ట్‌.. అమ్మాయిలు అలా చేస్తే పరీక్ష కేంద్రం మిస్‌ అవ్వాల్సిందే..!

పరీక్ష కేంద్రాల్లోకి వాటర్‌ బాటిళ్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు అనుమతించబోమని వెల్లడించారు. ముఖ్యమంగా అమ్మాయిలు చేతులకు గోరింటాకు, టాటూలు పెట్టుకోకూడాదు.

Written By: Raj Shekar, Updated On : May 5, 2024 3:14 pm

TS EAPCET-2024

Follow us on

TS EAPCET-2024: టీఎస్‌ ఎంఎసెట్‌.. ((TS EAPCET)‡ రాసే విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి కీలక సూచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ పరీక్ష మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈమేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్‌ రాసేందుకు 3.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. పరీక్ష జరిగే రోజుల్లో 90 నింఇషాల ముందే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు.

వీటికి అనుమతి లేదు..
ఇక పరీక్ష కేంద్రాల్లోకి వాటర్‌ బాటిళ్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు అనుమతించబోమని వెల్లడించారు. ముఖ్యమంగా అమ్మాయిలు చేతులకు గోరింటాకు, టాటూలు పెట్టుకోకూడాదు. ఈ నిభంధనలు అందరూపాటించాలని సూచించారు. లేనిపక్షంలో పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

పరీక్షల వారీగా వివరాలు..
ఇక ఎంసెట్‌లో మెడిసిన్‌ తొలగించారు. దీంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,54543 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మ విభాగాల కోసం 1,00,260 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. పరీక్షను 21 జోన్లలో నిర్వహిస్తారు. తెలంగాణలో 16, ఏపనీలో 5 జోన్లను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ కోసం 166 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి 135 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.