APTA 15Th Anniversary : ఘనంగా ముగిసిన ఆప్తా వేడుకలు

వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం  – మణిశర్మ సంగీత విభావరి ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నులపండుగగా ముగిశాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకి వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానంతో చివరి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. 8 మంది వృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు వద్దిపర్తి పద్మాకర్ గారు ఛలోక్తులు విసురుతు ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలు పొందాయి. జనసేన నాయకులు సత్య బొలిశెట్టి, […]

Written By: NARESH, Updated On : September 4, 2023 1:12 pm

APTA 15th Anniversary

Follow us on

  • వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం  – మణిశర్మ సంగీత విభావరి

ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార, సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నులపండుగగా ముగిశాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకి వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానంతో చివరి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. 8 మంది వృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు వద్దిపర్తి పద్మాకర్ గారు ఛలోక్తులు విసురుతు ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలు పొందాయి. జనసేన నాయకులు సత్య బొలిశెట్టి, డాక్టర్ హరి ప్రసాద్, బండ్రెడ్డి రామ్ తో నిర్వహించిన పొలిటికల్ ఫోరమ్, బండి సంజయ్ తో మీట్ అండ్ గ్రీట్, కళ్యాణ్ దిలీప్ సుంకర సామాజిక, రాజకీయ విశ్లేషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. చివరిగా మణిశర్మ తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో భాగంగా చివరి రోజు దాతలను, కన్వెన్షన్ కమిటీలలో కృషి చేసిన వారిని, ఆప్త ఎగ్జిక్యూటివ్ టీమ్ లను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి రాజకీయ సినిమా రంగాల నుంచి విచ్చేసిన ప్రత్యేక అతిథులు బొత్స సత్యనారాయణ, బండి సంజయ్, హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బండ్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర, కదిరి బాబురావు, మున్నా ధూళిపూడి అంగన రాయ్, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సంపత్ నంది, మెహ్రీన్ ఫిర్జాధ, లయ, అనంత్ శ్రీరామ్, ఆస్కార్ విజేత చంద్రబోస్, సత్య బొలిసెట్టి, తదితురులకు ఆప్త అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టే, కన్వీనర్ విజయ్ గుడిసేవ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అవార్డులు ప్రదానం :

మొట్టమొదటి సారిగా ఆప్తాలో ప్రవేశపెట్టిన ఆప్తా పురస్కారాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రెసిడెంట్స్ క్లబ్ (2008 నుంచి 2023 వరకు పని చేసిన ప్రెసిడెంట్స్) ఎంపిక చేసిన ప్రతిభావంతమైన వ్యక్తులకు ఈ పురస్కారాలు అందచేశారు.

ఆప్త జీవిత సాఫల్య పురస్కారం – సుబు కోట, ఆప్త పరమ విశిష్ట విశ్వ సేవా పురస్కారం – సంకురాత్రి చంద్ర శేఖర్,
ఆప్త విశిష్ట విశ్వ సేవా పురస్కారం రంగిశెట్టి మంగబాబు, శ్రీహరి కోటెల, ఆప్త సేవా పురస్కారం 2019-20కి శ్రీధర్ శంకరరావు, ఆప్త సేవా పురస్కారం 2021-22కి అనిల్ వీరిశెట్టి, ఆప్త సేవా పురస్కారం 2023కి రవి ఎలిశెట్టికి అందజేశారు.

మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగగా ముగిశాయి.