Ashok Veeraraghavan: భారత యువత విశ్వవేదికపై సత్తా చాటుతూనే ఉంది. అనేక మంది సాంకేతిక నిపుణులను ఇండియా తయారు చేస్తోంది. వారంతా వివిధ ఉద్యోగాల, ఉపాధి అవకాశాలు, ఉన్నత ఛాన్స్‌లు అందిపుచ్చుకుని ప్రపంచ నలుమూలలా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. భారత్ లేకుంటే.. అమెరికా లేదు అని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్‌గేట్స్ అనడమే భారతీయ సామర్థానికి నిదర్శనం. తాజాగా అమెరికాలోని భరతీయుడికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు కూడా వరించింది. టెక్సాస్‌లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా గుర్తింపు పొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓ డన్నెల్ అవార్డును ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్‌కు అందించారు. ఈ అవార్డును టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ(టామ్‌సెట్) ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి అందిస్తుంది. ఈ ఏడాది భారతీయ సంతతి అమెరికన్ ఈ అవార్డు అందుకున్నాడు.
ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ ఇంజినీర్‌గా..
అశోఓక్ వీర రాఘవన్ హూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్‌లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకు వీర రాఘవన్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఆదివారం అవార్డు అందుకున్నాడు.
పరిశోధన ఇదీ..
ప్రస్తుతం ఇమేజింగ్ టెక్నాలజీలో చాలా సమస్యలు ఉన్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులు ఉన్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు వీర రాఘవన్ పరిశోధనలు చేశారు. కారు నడుపుతున్నప్పుడు పొగ మంచు కారణంగా రోడ్డుపై ఎదరుగా వస్తున్న వాహనాలు కనిపించవు. విజిబిలిటీకి సంబంధించిన అలాంటి సమస్యలకు వీర రాఘవన్ పరిష్కారం చూపే పరిశోధనలు చేశాడు. త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకనుంది. ఇదిలా ఉండగా అశోక్ వీర రాఘవన్‌ది తమిళనాడు. ఆయన తాతలు ఇక్కడే ఉండేవారు. చిన్నతనంలో ఆయన కూడా తమిళనాడులో గడిపారు.