Bihar CM Nitish Kumar: ” నాకు ప్రధానమంత్రి పీఠం మీద ఆశ లేదు. దేశవ్యాప్తంగా తిరుగుతా. మమతా బెనర్జీ, కేసీఆర్, స్టాలిన్ వంటి వారిని కలుస్తా. కచ్చితంగా మోదీ వ్యతిరేక సర్కారు తీసుకొస్తా. జనతా మోడల్ ను మరోసారి తీసుకొస్తా” ఇవీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు.. తెరపైకి మళ్లీ జనతా ప్రయోగం ప్రతిపాదన రావాలని ఆయన కోరుతున్నారు. కానీ ఇక్కడ జయ ప్రకాష్ నారాయణ్ వంటి నిష్కలంక సారథి ఎవరంటే మాత్రం నితీష్ కుమార్ సమాధానం చెప్పడం లేదు. గత కొద్దిరోజులుగా పరిశీలిస్తే ప్రతిపక్షాలు ఐక్యంగా కదులుతున్నాయి. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో ఆ పార్టీలకు అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ అనే అత్యంత బలమైన ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బతీయాలని విషయంలో మాత్రం అవి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ పై పార్లమెంట్ అనర్హత వేటు వేయడంతో దానిని ప్రధాన కారణంగా చూపుతూ సుమారు 19 పార్టీలు బిజెపిపై యుద్ధానికి దిగాయి. ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాయి. అయితే ఆ పార్టీలు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తలంటింది. దర్యాప్తు సంస్థల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడిదని తూర్పార పట్టింది. ” మీరు అందరిలాంటి వారు కాదా? , మీకు ఎందుకు మినహాయింపులు ఇవ్వాలని” కేసును కొట్టేసింది.
సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తమ పోలీసులతో బీజేపీ ముఖ్యుల మీద కేసులు పెట్టిస్తున్నాయి. మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో ఏకంగా సిబిఐ అధికారులనే అరెస్టు చేయించింది. దేశ్ కి నేత అని ప్రకటించుకుంటున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీ నేతలపై ఏ విధమైన కేసులు పెడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఏకంగా ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని గోకుతున్నాడు.. మొయినాబాద్ ఫామ్ హౌస్, టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వంటి ఘటనల్లో బండిని కార్నర్ చేయబోయి బుక్ అయ్యాడు. రకరకాల కేసులు, అరెస్టులతో నేరుగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శినే లాగాలని చూసాడు. అంతేకాదు తనకు వీలు చిక్కినప్పుడల్లా పొలిటికల్ ఫాయిదాల కోసం జమ్మిక్కులు చేస్తున్నాడు. ఫలితంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడే ఈ కేసులతో నిస్సహాయంగా నిలబడి చూస్తున్నాడు. ఈ పరిణామం బిజెపి కేడర్ ను కుంగదీస్తోంది.” నేను నా ఇష్టం వచ్చినట్టు నీమీద బురద చల్లుతా. ఎలా కడుక్కుంటావో నీ ఇష్టం” అన్నట్టుగా కెసిఆర్ మోదీకే సవాల్ విసురుతున్నాడు. ఆ బిజెపి రాష్ట్ర నాయకుల అనైక్యత ఉండనే ఉన్నది. ఈ కేసులతో కేసీఆర్ ఇంకా వాటిని బట్టబయలు చేస్తున్నాడు. కాదు రాష్ట్రంలో బిజెపి నాయకులు ఎంతగా అంగీలు చింపుకుంటున్నా సెంట్రల్ పార్టీ ఏమి చేయలేదు అనే ధీమా కేసీఆర్ లో రోజు రోజుకు పెరిగిపోతుంది.
ఈ వరుస పరిణామాలతో భారతీయ జనతా పార్టీని ఏ స్థాయిలో ఢీకొడుతున్నాడనే ఇమేజ్ కెసిఆర్ కు కావాలి కాబట్టి.. దానిని దశల వారిగా సాధిస్తున్నాడు. తన బిడ్డ మీద కేసు పెట్టినందుకు కోపంతో రగిలిపోతున్నాడు. ఎక్కడపడితే అక్కడ బిజెపి నాయకులను టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు బిజెపిని ఎదుర్కొంటున్నందునే తనపై కక్షతో మోదీ వేధిస్తున్నాడని తన కరపత్రం నమస్తే తెలంగాణలో ప్రచారం చేయించుకుంటున్నాడు. ఈ ప్రచారం వల్ల అతగాడి కుటుంబం అవినీతి ఆరోపణలు పక్కకు వెళ్లిపోతున్నాయి. రాజకీయ వేధింపులు దర్జాగా తెరపైకి వస్తున్నాయి.
నాన్ బిజెపి పార్టీలో ఛాంపియన్ అనే విషయం ప్రస్తుతానికి వస్తే..అది తనకు రాజకీయంగా ఫాయిదా అవుతుందని కెసిఆర్ ఎత్తుగడ వేస్తున్నాడు. ఇందులో భాగంగానే తనను తాను దేశ్ కి నేతగా ప్రకటించుకుంటున్నాడు. ఇదే క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నాయనే విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు కనుక కేసీఆర్ ను లీడర్ ను చేస్తే ఎన్నికల ప్రచార వ్యయం మొత్తం ఆయనే భరిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.. మొన్న ఆంధ్ర జ్యోతి పేపర్ లో రాసిన వ్యాసంలో రాజ్దీప్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మోదీని ఎదురొడ్డే బలమైన లీడర్ కెసిఆర్ అని రాసుకొచ్చాడు. మమత, అరవింద్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో కూడా రాశాడు. ఇదే సందర్భంలో కెసిఆర్ వైఫల్యాలు రాయటంలో రాజ్దీప్ వెనకడుగు వేశాడు. ఈ మతలబు ఏమిటో అతడికే తెలియాలి.
ఇక ఈ ప్రధానమంత్రి పదవిపై స్టాలిన్, నితీష్ కూడా పడుతున్నారు. నితీష్ తన మదిలో ప్రధాన పదవి పీఠం అనేది లేదని చెబుతున్నప్పటికీ.. తెర వెనుక వాదనలు వేరే విధంగా ఉన్నాయి. ప్రతిపక్ష ఛాంపియన్ గా అయ్యే ప్రయత్నాల్లో స్టాలిన్ వేగంగా అడుగులు వేస్తున్నాడు. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ ప్రజలు చిత్తుగా ఓడించారు. దీనికి కారణం ప్రతిపక్షాలను జనతా పార్టీగా ఏకం చేసి, విజయం సాధించి, ఇందిరాగాంధీని గద్దె దించడంలో జయప్రకాష్ నారాయణ్ కీలకపాత్ర పోషించాడు.. ప్రస్తుతం ఆ పాత్రను నితీష్ కుమార్ పోషిస్తాను అని చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్కలంకుడుకాడు. క్రౌడ్ పుల్లర్ అంతకన్నా కాదు. అలాంటప్పుడు ప్రతిపక్షాలను ఎలా ఏకం చేయగలడు? ఇప్పటికే ఆ రాహుల్ చేస్తున్న నానా యాగీ పై శరత్ పవార్ నానా గడ్డీ పెట్టాడు. ఇలాంటప్పుడు ఆ మోదీ ని కొట్టే జేపీ ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి దీనికి సమాధానం ఎవరు చెబుతారో?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nitish said that he will tour the country in 2024 for the unity of the opposition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com