Vastu Tips: మనలో కొంతమందిని తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. మందులు వాడితే ఆ సమస్య తగ్గినా తర్వాత మరో కొత్త ఆరోగ్య సమస్య మొదలవుతూ ఉంటుంది. ఆర్థికంగా సంపన్నులు అయినప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల బాధ పడేవాళ్లు చాలామంది ఉంటారు. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది.
వాస్తు ప్రకారం మంచంను తలుపు ముందు ఉంచకూడదు. ఇలా ఉంచితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. బెడ్ రూమ్ లో మొక్కలను పెంచితే ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఎవరికైనా ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. తూర్పు దిశలో ఉండే కిటికీని ప్రతిరోజూ తెరిస్తే మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. పడకగదిలో మొక్కలు ఉంటే వాటి నుంచి రాత్రి సమయంలో విడుదలయ్యే కార్బన్ డై యాక్సైడ్ వల్ల శరీరానికి హాని కలుగుతుంది.
ఇంట్లో పగిలిన అద్దాలను ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదు. కిటికీలు, తలుపులపై పగుళ్లు ఏర్పడితే వాటిని వెంటనే మారిస్తే ఆరోగ్యానికి వాస్తు ప్రకారం మంచిదని చెప్పవచ్చు. ఇంట్లో దూలం ఉంటే ఆ దూలం కింద పడుకోవడం కూర్చోవడం చేయడం మంచిది కాదు. వాస్తు దోషాలు ఉన్న ఇళ్లలో పుట్టిన పిల్లలను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఉత్తర దిశలో సరిహద్దు గోడ తూర్పు దిశలో ఇల్లు ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఇల్లును నిర్మించుకుంటే ఇంట్లో సూర్య కిరణాలు పడి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి.
[…] Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 10 నుంచి జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తలపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిదు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించాలని చూస్తున్నారు.ఇందులో భాగంగానే ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. […]
[…] Jaganmohini: ప్రస్తుతం గ్రాఫిక్స్, విజ్యువల్ ఎఫెక్ట్స్ .. సినిమా మేకింగ్ లో కీలకంగా మారాయి. ఆధునికమైన సాంకేతికత వలన మూవీ మేకింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ బాగా పెరిగిపోయాయి కూడా. కాగా, అప్పట్లో అయితే అటువంటి పరిస్థితులు లేవు. ఆనాటి కాలంలో అనగా 1970 , 80 లలో దర్శకులు, డీఓపీలు కెమెరా టెక్నిక్స్ ఉపయోగించి తాము అనుకున్నది వెండితెరపైన ఆవిష్కరించేవారు. అలా వెండితెరపైన విజ్యువల్ వండర్ గా ఆవిష్కృతమైన చిత్రం ‘జగన్మోహిని’. ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న కథ తెలుసుకుందాం. […]
[…] Also Read: తరచూ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. … […]