TRSMA : రాష్ట్రంలో కొవిడ్ కేసుల విజృంభణ పేరుతో బడులు మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ( ట్రస్మా ) తప్పుబట్టింది. ప్రైవేట్ స్కూల్ వెంటనే తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసేంది. ఈనెల 30లోపు నిర్ణయం తీసుకోవాలని గడువు ఇచ్చింది. లేనియెడల తల్లిదండ్రులతో మాట్లాడుకుని తామే ఫిబ్రవరి 1 నుంచి బడులు తెరుస్తామని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. రాష్ట్రంలో వ్యాపారాలకు, ఆలయాలకు, మందు షాపులకు వేటికి లేని కొవిడ్ నిబంధనలు ఒక్క పాఠశాలకు ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతీసారి అన్నిటికంటే ముందే స్కూళ్ల మూసివేత వెనక ఏదో కుట్ర దాగుందనే విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వం నిర్ణయాన్ని ట్రస్మా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కరోనా అదుపులోని ఉందని ప్రభుత్వమే మీడియా ముఖంగా చెబుతున్నప్పుడు ఎందుకు స్కూళ్లు మూసి వేశారని అడిగారు. తెలంగాణ కంటే ఎక్కువ కేసులు నమోదువున్న రాష్ట్రాల్లో బడులు నడుస్తున్నాయని, తెలంగాణలోనే ఎందుకు మూసివేశారన్నారు. స్కూళ్లు తెరవాలని పిల్లల తల్లిదండ్రులే స్వయంగా కోరుతున్నారని, ఇప్పటికే విద్యార్థులకు చదువు లాస్ పెరిగిపోతుందని, అలాగే పరీక్షల కాలం మొదలవుతున్నందున.. కనీసం 50 శాతం మందితో పాఠశాలలు తెరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ !
ఈ సందర్బంగా TRSMA అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పేరుతో విద్యార్థుల జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కరోనాతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, దీంతో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పై తరగతులకు వెళ్లినప్పుడు ఏం చదవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటున్నారని వివరించారు.తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కరోనా వైరస్ జాగ్రత్తలను పాటిస్తూ విద్యాసంస్థలను నిర్విరామంగా సాగిస్తూ ఉన్నప్పుడే విద్యార్థుల జీవితాలు బాగుంటాయన్నారు. కరోనా కేసుల పేరుతో కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదని విమర్శించారు. ముందుగా కొవిడ్ ఏ రంగాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో గుర్తించి వాటిని కంట్రోల్ చేయాలన్నారు.
Also Read: బీజేపీ కీలక నేత విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించినట్టేనా..?
[…] Also Read: బడులు తెరుస్తారా లేదా..? తెలంగాణ ప్రభు… […]