Pushpa 2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విడుదలై 20 రోజులు పూర్తి అయ్యినప్పటికీ, ఇప్పటికీ కూడా ఈ చిత్రం కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. నేడు బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బేబీ జాన్’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ నిర్మించాడు. ఆయన దర్శకత్వం లో గతంలో తమిళంలో తెరకెక్కిన ‘తేరి’ చిత్రానికి ఇది రీమేక్. విజయ్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రానికి రీమేక్ అనగానే ఈ సినిమా పై అంచనాలు తగ్గిపోయాయి. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ లో రీమేక్ సినిమాలకు ఏమాత్రం ఆదరణ దక్కడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే రీమేక్ సినిమాలు చేసినా ఆదరణ లభించింది.
మిగిలిన హీరోలు రీమేక్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. పైగా ‘బేబీ జాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించాడు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం 12 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వస్తాయని తెలుస్తుంది. మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ ఆక్యుపెన్సీలను నమోదు చేసుకున్న ఈ చిత్రం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మాత్రం ఆశించిన స్థాయి ఓపెనింగ్ ని రాబట్టలేకపోయింది. అయితే నేడు కూడా పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతూ ఉండడం వల్ల, ఈ సినిమా పై గట్టి ప్రభావమే పడింది. బుక్ మై షో యాప్ లో ‘పుష్ప 2 ‘ చిత్రానికి గంటకు 18 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతుంటే, ‘బేబీ జాన్’ చిత్రానికి కేవలం 9 వేల టిక్కెట్లు మాత్రమే గంటకు అమ్ముడుపోయాయి.
అంటే 20 రోజులు దాటినా తర్వాత కూడా ‘పుష్ప 2’ చిత్రం కొత్త సినిమా మీద రెండు రెట్లు ఎక్కువ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ‘బేబీ జాన్’ చిత్రానికి 12 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తుండగా, ‘పుష్ప 2 ‘ చిత్రానికి 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు హిందీ వెర్షన్ నుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కొత్త సినిమాల మీద పుష్ప 2 చిత్రం ఈ స్థాయిలో డామినేషన్ చేయడాన్ని చూస్తుంటే సంక్రాంతి వరకు ఈ సినిమాకి థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉందని, ఒక పక్క ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆడితే, మరో పక్క ‘పుష్ప 2 ‘ చిత్రం థియేటర్స్ లో ఆడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.