Jr NTR : ఎన్టీయార్ తన బామ్మర్ది నార్నే నితిన్ సినిమాలని ఎందుకు ప్రమోట్ చేయట్లేదంటే..?

ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది...

Written By: NARESH, Updated On : January 29, 2024 2:01 pm

Why is Jr NTR not promoting his brother-in-law Narne Nithin's films

Follow us on

Jr NTR : సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడవ తరం హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్, తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. ఎవరికి సాధ్యం కాని రీతిలో సినిమాలను చేస్తూ హిట్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యామిలీ తనకంటూ తోడుగా ఉన్నప్పటికీ తన భార్య అయిన లక్ష్మీ ప్రణతి వాళ్ళ తమ్ముడు నార్నే నితిన్ అంటే ఎన్టీయార్ బామ్మర్ది కూడా ‘ మ్యాడ్ ‘అనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను కూడా అందుకున్నాడు. అయితే ఇదంతా చూస్తున్న అభిమానులు మాత్రం ఎన్టీయార్ నార్నే నితిన్ సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు.

బయటి వాళ్లు ఎవరో ఒకరు వచ్చి అడిగితేనే ప్రమోషన్ కి వెళ్లే ఎన్టీఆర్, వాళ్ల బామ్మర్ది కి మాత్రం ఎందుకు ప్రమోట్ చేయట్లేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీయార్ అభిమానులు కూడా ఈ విషయంలో ఎన్టీయార్ మీద కొంచెం కోపంతో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయాలి వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, అలాగే వాళ్ళు ఎదిగితే మనకి కూడా ఇండస్ట్రీ లో ఒక సర్కిల్ క ఏర్పడుతుంది అంటూ వాళ్ళు భావిస్తున్నారు.

మరి ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ ఎందుకు తనకు సపోర్ట్ చేయడం లేదు అనే దానిమీద కొంతమంది సినిమా ప్రముఖులు మాట్లాడుతూ ఎన్టీఆర్ కి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలుచుంటేనే సినిమా ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. బ్యాక్ ఎండ్ లో ఎవరో సపోర్ట్ చేస్తారని మనం ముందుకు వస్తే మన వర్క్ మీద మనం పూర్తిగా ఫోకస్ చేయలేం. అందుకే తన కాళ్ళ మీద తను ఎదగాలని ఎన్టీఆర్ తనని పట్టించుకోవట్లేదని కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది…