Tollywood 1 Hero: మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద చాలామంది హీరోలు తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది నటులు వెనకబడి పోతున్నారు. ముఖ్యంగా సక్సెసులు మాత్రమే ఇక్కడికి కీలక పాత్ర వహిస్తాయి… యాక్టింగ్ వచ్చిన రాకపోయిన సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా కీలకమైన పాత్రను వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా జరిగినా కూడా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నటినటులు ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలి…
ఇక ఇప్పటికే తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు… ఇక వీళ్ళందరు చేసే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయనే ఉద్దేశ్యంతోనే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వీళ్లకు పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దానిని కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.
ఏమాత్రం తేడా జరిగినా కూడా వీళ్ళ పొజిషన్స్ మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్నప్పటికి సినిమాల వైపు పెద్దగా ఆసక్తి చూపించడని అందరు అనుకున్నారు. కానీ గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమాతో 450 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. దాంతో ఆయన కూడా ముందు వరుసలోకి దూసుకొచ్చడనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న సినిమాలతో ఈ స్టార్ హీరోలు ఎలాంటి మ్యాజిక్ ను చేస్తారు. ఇందులో ఎవరు టాప్ పొజిషన్ కు చేరుకుంటారు… ఈ హీరోల మధ్య జరిగే ఈ పోటీలో మరి కొంతమంది వచ్చి చేరనున్నారా? బాలీవుడ్ హీరోలను పక్కన పెడితే తెలుగు హీరోలకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఇక ఈ క్రేజ్ ను వాడుకొని ఎవరు నెంబర్ వన్ హీరోగా మారతారు అనేది తెలియాల్సి ఉంది…
