‘కాళేశ్వ‌రం’పై ‘డిస్క‌వ‌రీ’ డాక్యుమెంట‌రీ!

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎక‌రాల‌కు నీళ్లు అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వ‌రం. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోత‌ల ప‌థ‌కంగా పేరుగాంచిన కాళేశ్వ‌రం ఘ‌న‌త గురించి లోతైన అవ‌గాహ‌న ఉన్నవారు చాలా త‌క్కువ మందే. ఇంత గొప్ప ప్రాజెక్టుకు సంబంధించిన వింత‌లు, విశేషాల‌ను ప్ర‌పంచానికి వివ‌రించబోతోంది ప్ర‌ఖ్యాత‌ ఛాన‌ల్ డిస్క‌వ‌రీ. ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో రూపొందించిన‌ ఓ డాక్యుమెంట‌రీని ఈ నెల 25న ప్ర‌సారం చేయ‌బోతోంది. ‘శంకుస్థాప‌న ఎవ‌రైనా చేస్తారు.. కానీ.. ప్రారంభోత్స‌వం మాత్రం కొంద‌రే […]

Written By: Bhaskar, Updated On : June 23, 2021 12:45 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎక‌రాల‌కు నీళ్లు అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వ‌రం. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోత‌ల ప‌థ‌కంగా పేరుగాంచిన కాళేశ్వ‌రం ఘ‌న‌త గురించి లోతైన అవ‌గాహ‌న ఉన్నవారు చాలా త‌క్కువ మందే. ఇంత గొప్ప ప్రాజెక్టుకు సంబంధించిన వింత‌లు, విశేషాల‌ను ప్ర‌పంచానికి వివ‌రించబోతోంది ప్ర‌ఖ్యాత‌ ఛాన‌ల్ డిస్క‌వ‌రీ. ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో రూపొందించిన‌ ఓ డాక్యుమెంట‌రీని ఈ నెల 25న ప్ర‌సారం చేయ‌బోతోంది.

‘శంకుస్థాప‌న ఎవ‌రైనా చేస్తారు.. కానీ.. ప్రారంభోత్స‌వం మాత్రం కొంద‌రే చేయ‌గ‌ల‌రు’ ఇది అన్ని ప‌నుల‌కూ వ‌ర్తిస్తుంది. ఇక‌, ప్ర‌భుత్వాలు చేప‌ట్టే ప్రాజెక్టుల గురించైతే చెప్పాల్సిన ప‌నేలేదు. ఇలాంటి ప్రాజెక్టును నిర్మించాలంటే.. ఎన్నో ద‌శాబ్దాల స‌మ‌యం ప‌డుతుంది. ఇందుకు లెక్క‌లేన‌న్ని ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

కానీ.. తెలంగాణ ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్టును కేవ‌లం మూడు సంవ‌త్స‌రాల్లోనే పూర్తి చేయ‌డం అంద‌రినీ అబ్బుర‌ ప‌రిచింది. అయితే.. ఈ ప్రాజెక్టులో ఎన్నో గొప్ప గొప్ప‌ విశేషాలు ఉన్నాయి. సాంకేతిక ప‌రిజ్ఞానం నుంచి మొద‌లు పెడితే.. ఇంజ‌నీర్లు, కార్మికుల క‌ష్టం వ‌ర‌కు ఎన్నో అంశాలు ఉన్నాయి. వీట‌న్నింటినీ ప్ర‌పంచానికి వివ‌రించ‌బోతోంది డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు 2016 మే 2న క‌న్నెప‌ల్లి వ‌ద్ద కేసీఆర్ శంకుస్థాప‌న చేసిన ద‌గ్గ‌ర్నుంచి.. ప్రాజెక్టును ప్రారంభించే వ‌ర‌కూ సాగిన ఈ మ‌హా య‌జ్ఞాన్ని కూలంక‌షంగా వివ‌రించ‌బోతోంది. గంట‌పాటు ప్రాస‌ర‌మ‌య్యే ఈ డాక్యుమెంట‌రీలో ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారాన్ని వివ‌రించ‌నున్నారు.

నిత్యం మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా చేప‌ట్టిన‌ ఈ భారీ ప్రాజెక్టు కింద.. ఇర‌వై పంపు హౌస్ లు నిర్మించారు. వీటిల్లో ఉప‌యోగించే భారీ మోటార్లు ప్రపంచంలోనే ఎక్క‌డా లేవు. వాటిని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించారు. దాదాపు రూ.80 వేల కోట్ల వ్య‌యంతో నిర్మిత‌మైన ఈ ఎత్తి పోత‌ల ప‌థ‌కం జాతీయంగా ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు డిస్క‌వ‌రీ డాక్యుమెంట‌రీతో ప్ర‌పంచవ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకోబోతోంది. తెలుగు, హిందీ ఇంగ్లీష్‌ స‌హా మొత్తం ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ డాక్యుమెంట‌రీ ప్ర‌సారం కానుంది. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి 9 గంట‌ల వ‌ర‌కు ఈ డాక్యుమెంట‌రీ ప్ర‌సారం కానుంది.