Sleeping in Light or Dark : ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, మారిన జీవనశైలి వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మనిషికి తిండి, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. తిండి లేకపోయిన కొన్ని రోజులు బ్రతకగలరు ఏమో.. కానీ ఒక్క రోజు నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలు వెంటనే వచ్చేస్తాయి. ఒక్క రోజు నిద్ర తక్కువైన మనిషి చాలా నీరసంగా అయిపోతాడు. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా సోషల్ మీడియాకు బానిస అయ్యి.. పగలు, రాత్రి తేడా లేకుండా వాడుతున్నారు. మొబైల్ నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల తొందరగా నిద్ర పట్టదు. దీనివల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే నిద్రపోయేటప్పడు కొందరు వెలుతురులో పడుకుంటారు. మరికొందరు చీకట్లో నిద్రపోతారు. అసలు కొందరికి లైట్లు లేకపోతే నిద్రపట్టదు. మరికొందరికి లైట్లు ఉంటే నిద్ర పట్టదు. అసలు వెలుతురు లేదా చీకటి ఎక్కడ పడుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వెలుతురు కంటే చీకటిలో నిద్రపోతేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని లైట్లు నిరోధిస్తాయి. దీంతో నిద్రపట్టకపోవడంతో మీకు నిద్రలేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో నిద్ర లేకపోతే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెలుతురులో నిద్రపోవడం వల్ల డీప్ స్లీప్ చేయలేరు. రాతంత్రా నిద్ర పట్టనట్టుగా ఏదోలా అనిపిస్తుంది. అదే చీకటిలో నిద్రపోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఎలాంటి లైట్లు ఉండి ఇబ్బంది పెట్టవు. దీంతో మీకు మంచి నిద్ర పడుతుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. అలాగే కళ్లకు కూడా కాస్త విశ్రాంతి లభిస్తుంది. కొందరికి చీకటిలో నిద్రపోవడం అంటే భయం. అందుకే వెలుతురులో నిద్రపోతారు. ఇలాంటి వాళ్లు కళ్ల మాస్క్ పెట్టుకుని నిద్రపోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే అలసట, నీరసం, జీర్ణ సమస్యలు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నిద్రలేకపోతే జీర్ణ క్రియ దెబ్బతిని కడుపు, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు బారిన పడాల్సి వస్తుంది. రాత్రిపూట పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే పదార్థాలు వల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బాగా వేయించిన ఫుడ్, సిట్రిక్ ఆమ్లం వంటివి కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు రాత్రి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే పదార్థాన్ని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్లవలసి వస్తుంది. దీంతో మీకు నిద్రలేమి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.