AP Rains: ఏపీకి వరుసగా వర్ష హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా బంగాళాఖాతం నుంచి మరో హెచ్చరిక వచ్చింది. పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ.. దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజులు పాటు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజా హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది.మంగళవారం తిరుపతి,నెల్లూరు, ప్రకాశం తో పాటు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. బుధవారం వరకు వీర ప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బాలులు వీస్తాయి అని కూడా స్పష్టం చేసింది.కోస్తా జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
* ఈరోజు భారీ వర్షాలు
ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.ప్రధానంగా కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు తో పాటు ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయి.
* వారం రోజులుగా ఉత్తరాంధ్రలో
గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం తో పాటు విజయనగరంలో వర్షాలు కురిసాయి. దీంతో రైతాంగానికి అపార నష్టం కలిగింది. ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండడంతో ధాన్యం తడిచి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శనివారం మధ్యాహ్నం నుంచి తెరిపినిచ్చింది. ఆదివారం ఎండ కాయడంతో ఇక వర్షాలు బాధ తప్పిందని అంతా భావించారు. కానీ మరో అల్పపీడన హెచ్చరికతో ఇప్పుడు రైతులు ఆందోళన చెందుతున్నారు.
* పెరిగిన చలి
ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. విపరీతమైన పొగ మంచు పడుతోంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం మరింతగా చల్లబడుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు వీడకపోవడంతో రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఇంకోవైపు ఏజెన్సీలో పరిస్థితులు దిగజారుతున్నాయి.అతి తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షం, ఇంకోవైపు చలితో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.