https://oktelugu.com/

Minister Roja Comments: చూసుకోండబ్బా.. జబర్ధస్త్ పై మంత్రి రోజా అనూహ్య కామెంట్స్

Minister Roja Comments: జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా రోజాకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతకంటే ముందే ఆమె హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తనదైన శైలిలో పరిశ్రమలో మంచి మార్కులు కొట్టేసింది. తరువాత కొంత కాలం విరామం ఇచ్చినా తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. కానీ అనుకోకుండా జబర్దస్త్ షోకు జడ్జిగా అవతారమెత్తింది. దీంతో ఒక్కో షో కు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2022 / 03:48 PM IST
    Follow us on

    Minister Roja Comments: జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా రోజాకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతకంటే ముందే ఆమె హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తనదైన శైలిలో పరిశ్రమలో మంచి మార్కులు కొట్టేసింది. తరువాత కొంత కాలం విరామం ఇచ్చినా తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. కానీ అనుకోకుండా జబర్దస్త్ షోకు జడ్జిగా అవతారమెత్తింది. దీంతో ఒక్కో షో కు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె దాదాపు తొమ్మిదేళ్లు జబర్దస్త్ కు జడ్జిగా పనిచేసి ఎంతో కొంత వెనకేసుకున్నట్లు తెలిసిందే.

    roja:

    Also Read: ‘Sunshine’ New OTT Platform: స‌రికొత్త `స‌న్ షైన్` ఓటీటీ ప్లాట్ ఫామ్ లోగో లాంచ్‌

    తనతోపాటు వచ్చిన నాగబాబు బయటకు వెళ్లినా ఆమె మాత్రం జబర్దస్త్ నే నమ్ముకుని ఇక్కడే ఉండిపోయింది. దీంతో మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్ ను వీడింది. ఇప్పుడు విలాసవంతమైన కార్లు కొనుగోలు చేస్తోంది. దీనిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అదంతా అక్రమంగా సంపాదించిన సొమ్మే అని విమర్శలు వస్తున్నాయి. కానీ దీన్ని రోజా ఖండిస్తోంది. తనకు అక్రమంగా సంసాదించాల్సిన అవసరం లేదని చెబుతోంది. తాను జబర్దస్త్ తో పాటు పలు ఈవెంట్లు చేసినప్పుడు తన సంపాదన ఎంతో చూసుకోండి.

    jabardasth:

    Also Read: MP Gorantla Madhav Controversy: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో ఊహించని ట్విస్ట్..

    తన ఇన్ కమ్ టాక్స్ రశీదులు కూడా చూసుకోండి. తాను నెలకు ఎంత ట్యాక్స్ కడుతున్నానో తెలుసుకోండి. కానీ అక్రమ సంపాదన అనేది లేదని కౌంటర్ ఇస్తోంది. మరోవైపు జబర్దస్త్ లో పదేళ్లు ఉండి బాగా సంపాదించుకున్నారని మరో వాదన వస్తోంది. ఈ విమర్శలపై రోజా కూడా తగిన సమాధానమే చెబుతోంది. తాను మొదట హీరోయిన్ గా చేశానని వివరణ ఇస్తోంది. అప్పటి నుంచే తనకు ఎంతో డబ్బు వచ్చేదని ఇందులో ఎలాంటి అక్రమ మార్గాల్లో సంపాదించింది లేదని పేర్కొంటున్నారు. రోజా సినిమాలు, జబర్దస్త్ , పలు ఈ వెంట్ల ద్వారా సంపాదించుకున్న మాట వాస్తవమే. కానీ తాను ఎక్కడ కూడా అన్యాయం చేసి సంపాదించింది ఒక్క పైసా కూడా లేదని చెప్పింది. దీంతో రోజా నెటిజన్లు వేసిన ప్రశ్నలకు తగిన విధంగా సమాధానం చెబుతోంది. తనకు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదంటోంది. న్యాయపరంగా తాను సంపాదించినవే కానీ ఎవరిని మోసం చేసి తీసుకున్నవి కావని అంటోంది. జబర్దస్త్ ఒక్కటే తనకు అన్నం పెట్టలేదని సినిమాల నుంచి తనకు వచ్చిన సంపాదనతో ఇలా ఉన్నానని బదులు చెప్పింది.

    Also Read: Ashu Reddy: అషురెడ్డి వర్జినా? నెటిజన్ ప్రశ్నకు ఆమె షాకింగ్ జవాబు