Viral Video : ఇది కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు.. జంతువుల మధ్య కూడా జరుగుతుంది. కాకపోతే మనుషులు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటారు కాబట్టి.. వారి పరిణాయానికి మంచి పేరు ఉంటుంది. కానీ జంతువులు అలా కాదు కదా.. జంతువుల కంటే మనిషి ఉన్నతమైనవాడు కాబట్టి.. వివాహ విషయంలో ప్రతి క్రతువును కూడా గొప్పగా జరుపుకుంటాడు. వెనుకటి కాలం నుంచి ఇప్పటివరకు స్త్రీ, పురుషులే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సంసార జీవితం ద్వారా పిల్లల్ని కంటూ తమ ఉన్నతిని.. తమ సంతతిని పెంచుకుంటున్నారు. తద్వారా తమకంటూ ఈ సమాజంలో ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటున్నారు . కానీ ఇప్పుడు మీరు చదవవే కథనంలో జరిగిన పెళ్లి చాలా విచిత్రమైనది.. విభిన్నమైనది. ఈ పెళ్లి జరిగిన తీరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో పడి పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.
Also Read :వాట్ యాన్ ఐడియా సర్ జీ.. కర్రలు, బాటిల్‌తో బ్యాట్ తయారుచేసిన బాలుడు
ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు
సాధారణంగా పాశ్చాత్య దేశాలలో స్వలింగ వివాహాలు జరుగుతుంటాయి. అంటే ఒక మగాడు మరొక మగాడిని పెళ్లి చేసుకోవటం.. ఒక మహిళను మరొక మహిళ పెళ్లి చేసుకోవడం అక్కడ సర్వసాధారణం. పైగా అక్కడ చట్టాలు కూడా వారికి రక్షణ కల్పిస్తున్నాయి. కానీ ఈ ధోరణి మన దేశంలో ఇప్పటివరకు లేదు. పైగా మన చట్టాలు అందుకు ఒప్పుకోవు. ఎందుకంటే స్వలింగ వివాహాలను మన చట్టాలు గనుక ఆమోదిస్తే అంతిమంగా అది మన దేశంలో పెడపోకడలకు దారితీస్తుంది. అది మన దేశ అభివృద్ధిపై.. సంతాన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మన దేశ చట్టాలను కాదని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులు పరస్పరం పెళ్లి చేసుకున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం.. మగాళ్లు అంటే ఇష్టం లేకపోవడమే.. పెరిగిన వరకట్నాలు.. మహిళలపై వేధింపులు.. గృహహింస.. ఇవన్నీ చూడలేక వారిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయూ కోర్టు ప్రాంగణంలో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు వీరిద్దరూ మూడు నెలలుగా కలిసే ఉంటున్నారు. ముందుగా వీరు కోర్టు ప్రాంగణంలో ఒక న్యాయవాదిని కలిశారు. తమ వివాహానికి న్యాయపరమైన సహాయం అందించాలని కోరారు. దీంతో ఆ లాయర్ స్వలింగ వివాహానికి మన చట్టం అంగీకరించదని పేర్కొన్నారు..” పురుషులు అంటే ఇష్టం లేదు. వారిని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఆసక్తి లేదు. గత మూడు నెలలుగా మేమిద్దరం కలిసి ఉంటున్నాం. మాకు మేము గా బతకాలి అనుకుంటున్నాం. అందువల్లే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికి న్యాయపరమైన సహాయం చేయండి.. వీలుకాకుంటే మా పని మేము చేసుకుంటామని” ఆ మహిళలు ఆ న్యాయవాదితో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలో ఉన్న గుడిలోకి వెళ్లి పరస్పరం పూజలు చేశారు. ఆ తర్వాత ఒకరికి ఒకరు నుదుటిమీద సింధూరం పెట్టుకున్నారు. ఆ తర్వాత పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఇక అక్కడే ఒక ఆటో ఎక్కి వారు ఉంటున్న చోటుకు వెళ్ళిపోయారు.. గత మూడు నెలలుగా వారిద్దరు కలిసే ఉంటున్నారు. వారిద్దరికీ గతంలోనే పరిచయం ఉండేది. అది ఇప్పుడు ప్రేమగా మారింది. చివరికి పెళ్లికి దారితీసింది. ఇక ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
View this post on Instagram