దివంగత నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ ‘ప్రత్యూష బెనర్జీ’ జీవితంలో ఎంతో డ్రామా ఉంది. అయితే ఆమె గురించి తాజాగా ఓ నిర్మాత చేసిన కామెంట్స్ ఆమె సన్నిహితులను తీవ్రంగా బాధ పెడుతుంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అంటే.. ‘వికాస్ గుప్తా’. వికాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ప్రత్యూష బెనర్జీ ప్రేమించుకున్నామని చెప్పుకొచ్చాడు.
అయితే, ప్రత్యూష బెనర్జీకి నేను అంటే ఎంతో ప్రేమ. బహుశా ఆ ప్రేమే నాకు ఆమెను దూరం చేసింది. కానీ ఆ దూరానికి కారణం మాత్రం నా గురించి ఎవరో చెడుగా ప్రత్యూష బెనర్జీకి చెప్పారు. అది ఆమె నమ్మేసింది. ఆ విషయంలో మా ఇద్దరికీ కొన్ని సార్లు గొడవలు జరిగాయి. ఇక మా రిలేషన్ ను కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.
చివరకు మా ఇద్దరికీ బ్రేకప్ అయింది అంటూ తాజా ఇంటర్వ్యూలో వికాస్ వివరించాడు. పైగా తనకు ప్రత్యూష దూరం అయినప్పుడు ఆమె మీద నాకు విపరీతమైన కోపం పెంచుకున్నాను. దాంతోనే ఆమె బయట ఎక్కడైనా కనిపించినా, నేను చూపు తిప్పుకొని ఆమెవరో తెలియనట్లే వెళ్లి పోయేవాడిని. అయితే, ఆమెంటే నాకెంతో ఇష్టం. అందుకే తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను.
ఇక తాను బైసెక్సువల్ అన్న విషయం ఆమె నేను విడిపోయాకే తెలిసింది అంటూ వికాస్ చాలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే, నిర్మాత వికాస్ గుప్తా కామెంట్స్ పై ప్రత్యూష క్లోజ్ ఫ్రెండ్, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కామ్య పంజాబీ సీరియస్ అయ్యారు. ‘వికాస్ గుప్తా అసలు చెప్పింది నిజమా ? అబద్దమా ? అన్నది ఒక్క ప్రత్యూషకి మాత్రమే తెలుసు.
కానీ, దాని గురించి మాట్లాడటానికి ప్రత్యూష ఇప్పుడు మన మధ్య లేదు. ఈ లోకంలో లేని వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను వికాస్ ఇప్పుడెందుకు పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద చెబుతున్నాడు ? ప్రత్యూషతో ఉన్న అనుబంధం గురించి వికాస్ మాట్లాడకుండా ఉండాలి. బహుశా అతను ఫేమస్ కావడానికి ఈ కామెంట్స్ చేస్తున్నాడేమో. ఇలాంటి వాటిని నేను అస్సలు మెచ్చుకోను’ అంటూ కామ్య చెప్పుకొచ్చింది.