
ఏపీలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 18,26,751 కు కరోనా కేసుల సంఖ్య చేరింది. 24 గంటల్లో కరోనాతో 57 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో 12,109 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 10,228 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.