HomeNews Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి బాగోతం.. వైయస్ జగన్ సంచలన వీడియో రిలీజ్!

 Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి బాగోతం.. వైయస్ జగన్ సంచలన వీడియో రిలీజ్!

 Vijaya Sai Reddy : ఇటీవల మద్యం కుంభకోణం( liquor scam) ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణం పై దృష్టి పెట్టింది. ప్రాథమిక ఆధారాలను సేకరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అటు తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని తేల్చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని ప్రకటించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డిని పిలిచి మరి విచారణ చేపట్టింది. ఆయన కీలక ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది.

* విజయసాయిరెడ్డి ఎంట్రీ తో..

విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు ఇచ్చిన తరువాత మాత్రమే.. ఈ కేసుకు సంబంధించి కీలక అరెస్టులు జరిగాయి. అప్పటి సీఎం ఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల పర్వం నడిచింది. తరువాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరుగుతుందని ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం కుంభకోణం కేసునకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అసలు ఈ కేసుతో విజయసాయి రెడ్డికి అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకే ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకుంది.

* టిడిపి నేతతో భేటీ..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ప్రారంభం అయింది. తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుటకు విజయసాయిరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. తాడేపల్లి లోని ఓ రహస్య ప్రాంతంలో టిడిపి వ్యవహారాలను దగ్గరగా చూసే టీడీ జనార్దన్ అనే నేతతో విజయసాయిరెడ్డి సమావేశం అయినట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. తన వాహనంలో ప్రత్యేకంగా వెళ్లిన విజయసాయిరెడ్డి టీడీ జనార్ధన్ తో సమావేశం అయినట్లు అందులో కనిపిస్తోంది. అటు తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరైనట్లు అందులో చూపుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

 విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు..
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version