Hero Simbu Transgender: తమిళనాడు లో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు శింబు(Silambarasan TR). హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఈ హీరో సినిమాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి. రీసెంట్ గా ఆయన మొట్టమొదటిసారి కమల్ హాసన్(Kamal Haasan) తో కలిసి ‘థగ్ లైఫ్'(Thug Life) అనే చిత్రంలో నటించాడు. మణిరత్నం దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల నాల్గవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మణిరత్నం స్టైల్ లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఘర్షణ ఎంత వరకు దారి తీసిందో చెప్పే కథ లాగా అనిపించింది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో శింబు తన 50 వ సినిమా గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నా 50వ చిత్రాన్ని నా సొంత నిర్మాణ సంస్థ ఆత్మన్ సినీ ఆర్ట్స్ లో నిర్మిస్తున్నాను. ఇందులో నేను ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించబోతున్నాను. ఒక నటుడు అన్నాక అన్ని తరహా పాత్రల్లో నటించాలి. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి అనుకున్నప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. ఈ పాత్ర చేయడానికి ముందుగా నేను కమల్ హాసన్ గారితో చర్చలు జరిపి ఆయన సలహాలు తీసుకున్నాను. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి’ అంటూ చెప్పుకొచ్చాడు శింబు. ముందుగా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా నిర్మించాలని అనుకున్నాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుండి తప్పుకోవడం తో శింబు నే స్వయంగా తన నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
శింబు కి ఒకానొక సమయం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఆ ఫ్లాప్స్ కారణంగా ఆయన మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. కానీ మళ్ళీ ఆయన ‘మానాడు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని ట్రాక్ లో వచ్చేశాడు. ఆ సినిమా తర్వాత ఈయన చేసిన చిత్రాలన్నీ వరుసగా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ‘థగ్ లైఫ్’ చిత్రం తో మరోసారి ఆయన సక్సెస్ ని ఏ మేరకు అందుకుంటాడో చూడాలి. మరోపక్క శింబు ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఎంతో మంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. వాటిల్లో ఏదీ కూడా నిజం అవ్వలేదు. మరి ఇప్పుడు శింబు ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా?, లేకపోతే బయట అమ్మాయిని చేసుకోబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.