* విజయసాయిరెడ్డి ఎంట్రీ తో..
విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు ఇచ్చిన తరువాత మాత్రమే.. ఈ కేసుకు సంబంధించి కీలక అరెస్టులు జరిగాయి. అప్పటి సీఎం ఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల పర్వం నడిచింది. తరువాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరుగుతుందని ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం కుంభకోణం కేసునకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అసలు ఈ కేసుతో విజయసాయి రెడ్డికి అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకే ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకుంది.
* టిడిపి నేతతో భేటీ..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ప్రారంభం అయింది. తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుటకు విజయసాయిరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. తాడేపల్లి లోని ఓ రహస్య ప్రాంతంలో టిడిపి వ్యవహారాలను దగ్గరగా చూసే టీడీ జనార్దన్ అనే నేతతో విజయసాయిరెడ్డి సమావేశం అయినట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. తన వాహనంలో ప్రత్యేకంగా వెళ్లిన విజయసాయిరెడ్డి టీడీ జనార్ధన్ తో సమావేశం అయినట్లు అందులో కనిపిస్తోంది. అటు తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరైనట్లు అందులో చూపుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం
తాడేపల్లి పార్క్ విల్లాలో..
విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి pic.twitter.com/tBQwu9jkdx— రవి చౌదరి (@Ravi87443929) May 25, 2025