Vastu Tips: ఇంట్లో మనం కూర్చునేవి ఏ ప్లేస్ లో ఉండాలి?

ఇంటి ప్రధాన ద్వారం ప్రకారం సోఫా దిశను ఉంచాలట. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటే ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో సోఫా ఉండాలట. ఇంటి మెయిన్ డోర్ పడమర దిశలో ఉంటే సోఫాను నైరుతి దిశలో ఉంచాలట.

Written By: Swathi, Updated On : March 28, 2024 5:36 pm

Vastu Tips

Follow us on

Vastu Tips: ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో సోఫాలను అమరుస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథులను, లేదా రోజు కూర్చోవడానికి ఈజీగా కంఫర్ట్ గా ఉండాలంటే సోఫా ఉండాల్సిందే అనుకుంటారు. కానీ దీన్ని సరైన స్థలంలో అమర్చడం చాలా ముఖ్యం. సోఫా నిర్వహణ, కండిషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతుంది వాస్తు శాస్త్రం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం ప్రకారం సోఫా దిశను ఉంచాలట. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటే ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో సోఫా ఉండాలట. ఇంటి మెయిన్ డోర్ పడమర దిశలో ఉంటే సోఫాను నైరుతి దిశలో ఉంచాలట. వీటిని పాటిస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. మరి ఆకారం కూడా ఎలా ఉండాలో చూసుకోవాలట.

ప్రస్తుతం చాలా మంది ఎల్ షేప్, యూ షేప్ సోఫాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటి వల్ల దిశ, స్థానాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒకవేళ ఎల్ షేప్ సోఫా ఉంటే దానిలో ఒక భాగం డ్రాయింగ్ రూమ్ వైపు దక్షిణం వైపు, మరొక భాగం పశ్చిమం వైపు ఉండేలా చూసుకోండి. అంటే సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు, ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. యూ ఆకారంలో ఉన్న సోఫా అయితే ఎక్కువ భాగం డ్రాయింగ్ రూమ్ దక్షిణ దిశలో ఉంచాలి. మిగిలిన రెండు భాగాలు పశ్చిమ ఉత్తర దిశల్లో ఉంచాలి.

సోఫా దిశతో పాటు మరికొన్ని విషయాల మీద కూడా శ్రద్ధ వహించాలి. సోఫా పై నుంచి మాత్రమే కాదు కింద కూడా శుభ్రం చేయాలి. సోఫాలో కూర్చోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవాలి. సోఫాలో కూర్చుంటే శబ్ధం రాకూడదు. సోఫాలో బట్టలను, వస్తువులను కుప్పగా ఎప్పుడు వేయకూడదు. సోఫాను చక్కగా చూసుకోవాలి.