Anasuya: అనసూయ భరద్వాజ్ తెలియని జబర్దస్త్ ప్రేమికులు ఉండరు. ఆమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర పై సెన్సేషన్ సృష్టించింది. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ గ్లామర్ ఒలకబోయడంలో అనసూయ తర్వాతే ఎవరైనా. తెలుగులో గ్లామరస్ యాంకర్ గా ట్రెండ్ సెట్ చేసింది. జబర్దస్త్ షో వల్ల అనసూయ ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం నటిగా వరుస సినిమాలు చేస్తుంది. విలక్షణ పాత్రలు చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటుంది. అనూహ్యంగా బుల్లితెరకు దూరమైంది.
యాంకరింగ్ కి ఫుల్ సాప్ట్ పెట్టింది. పూర్తి స్థాయి నటిగా సెటిల్ అయిపోయింది. అయితే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ మానేయడానికి గల కారణాలు మాత్రం సస్పెన్సు గానే ఉంచింది. జబర్దస్త్ రేటింగ్ పడిపోవడం వలనే మానేసిందనే వాదన ఉంది. తాజాగా ఈ విషయంపై అనసూయ ఓపెన్ అయింది. రీసెంట్ ఇంటర్వ్యూలో జబర్దస్త్ వీడడం వెనుకున్న రీజన్ బయటపెట్టింది. జబర్దస్త్ నుండి వెళ్లిపోయారా? లేక వాళ్ళు తీసేశారా? అని యాంకర్ అడగ్గా… నన్ను ఎవరైనా తీసేస్తారా .. నేనే మానేశాను అని సమాధానం ఇచ్చింది.
ఆ సమయంలో నేను ఒకేసారి మూడు తెలుగు సినిమాలు, మూడు తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. నా షెడ్యూల్స్ కారణంగా మిగతా కమెడియన్స్ ఇబ్బంది పడ్డారు. నా కారణంగా వల్ల వాళ్ళ ఈవెంట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను తప్పుకున్నానని, అనసూయ వెల్లడించింది. మల్లెమాల సంస్థతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రపోజల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అని అనసూయ అన్నారు.
సినిమాల్లో బిజీ కావడం వలన జబర్దస్త్ మానేసినట్లు క్లారిటీ ఇచ్చింది. 2013లో జబర్దస్త్ షో ప్రారంభించారు. అనసూయ యాంకర్ గా, రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించారు. దాదాపు పదేళ్లు జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగిన అనసూయ 2022 లో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన రజాకార్ ఇటీవల విడుదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2లో విలన్ గా మరోసారి మెప్పించనుంది.