https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ చేస్తున్న ఆ పని భార్య స్నేహారెడ్డికి నచ్చడం లేదా… ఇద్దరి మధ్య గొడవలు!

అల్లు అర్జున్ తన పెళ్లి రోజు సందర్భంగా విషెస్ చెప్తూ భార్య పై ప్రేమని చాటుకున్నారు. అయితే ఓ విషయంలో అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ల మధ్య విభేదాలు తలెత్తాయట. మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : March 28, 2024 / 04:29 PM IST

    Clashes between Allu Arjun and Sneha Reddy

    Follow us on

    Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇండస్ట్రీలో లోని యువ జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి వివాహం జరిగి 13 ఏళ్ళు అవుతుంది. ఇటీవల అల్లు అర్జున్ తన పెళ్లి రోజు సందర్భంగా విషెస్ చెప్తూ భార్య పై ప్రేమని చాటుకున్నారు. అయితే ఓ విషయంలో అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ల మధ్య విభేదాలు తలెత్తాయట. మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    అల్లు అర్జున్ – స్నేహారెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 2011లో ఘనంగా వివాహం చేసుకున్నారు. వారికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. నటుడిగా అల్లు అర్జున్ చాలా బిజీ. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు. ముఖ్యంగా అయాన్, అర్హలతో ఆడుకోవడం అల్లు అర్జున్ కు ఎంతో ఇష్టమైన వ్యాపకం. అయాన్, అర్హ లు ఆయనకు ప్రాణంతో సమానం. వారికి చిన్న కష్టం కలగకుండా చూసుకుంటారట.

    పిల్లలను ఎంతో గారాబం చేస్తూ ఉంటాడట. స్నేహ ఇందుకు పూర్తి వ్యతిరేకం. పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉన్నా కూడా గారాబం చేస్తే చెడిపోతారని ఆమె భావిస్తారట. ప్రతి విషయంలో వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలని .. సొంతగా ఎదిగే ఆలోచన వాళ్లకు ఇప్పటి నుంచే అలవాటు చేయాలని స్నేహ రెడ్డి అనుకుంటారట. ఇక ఈ విషయంలోనే భర్త పై వాదనకు దిగినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో గారాబం చెయ్యొద్దు అని, అవసరమైనపుడు దండించాలి అని చెబుతుంటుందట.

    అయితే ఇది అంత సీరియస్ గొడవేమి కాదని తెలుస్తుంది. సాధారణంగా భార్య – భర్తల మధ్య ఉండే గొడవలే అని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కొందరు నెటిజన్లు స్నేహ రెడ్డి కి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం సరైంది అంటున్నారు. ఇక అల్లు అర్జున్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2 తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.