
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో బ్యాంకు అధికారులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి పౌరునికి టీకా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక టీకా డ్రైవ్ పై బీఆర్ కేఆర్ భవన్ లో వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఇవాళ సమావేశం నిర్వహించారు.