https://oktelugu.com/

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి మరో పాట విడుదల.. మరోసారి మాయ చేసిన సిద్​ శ్రీరామ్​

Radhe Shyam: యంగ్ రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి […]

Written By: , Updated On : December 2, 2021 / 12:14 PM IST
Follow us on

Radhe Shyam: యంగ్ రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది​. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తున్నారు.

Nagumomu Thaarale Video Song | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్​లు నెట్టింట హల్​చల్​ సృష్టిస్తున్నాయి. తెలుగులో మరేసినిమా సాధించని రికార్డులను రాధేశ్యామ్​ తిరగరాసింది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
Also Read: సిరివెన్నెల మృతికి సంతాపంగా “రాధే శ్యామ్” సాంగ్ రిలీజ్ వాయిదా…

Radhe Shyam

Radhe Shyam Prabhas and Pooja Hegde

తాజాగా, ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం.సిద్​ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ఎందో మధురంగా ఆకట్టుకుంది. ఈ  రోమియో, జూలియట్ ప్రేమకథకు జస్టిన్ ప్రభాకరన్  అందమైన సంగీతన్ని అందించారు. వచ్చే ఏడాది జనవరు 14న ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఈ సినిమాతో పాటు ప్రభాస్​ ఆదిపురుష్ సినిమాలోనూ నటిస్తున్నారు. దీంతో పాటు సలార్​ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఆదిపురుష్​ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయింది. ఇందులో రాముడి పాత్రలో కనువిందు చేయనున్నారు ప్రభాస్. కాగా, ఈ సినిమాలో కృతి సనన్​ సీత పాత్రలో నటించింది. సైఫ్​ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.

Also Read: స్నేహితులతో కలిసి రాధేశ్యామ్​ సినిమా చూసిన ప్రభాస్​.. ఆ సీన్​ మాత్రం?