వైఎస్ షర్మిలకు షాకిచ్చిన టీఆర్ఎస్?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో బుధవారం పర్యటించారు. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో పర్యటించి మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు సూర్యపేటల్లో తిరిగారు. సీనియర్ నేత నర్సిరెడ్డి ఇంట్లో అల్పాహారం చేశారు. తర్వాత కరోనాతో మృతిచెందిన తెలంగాణ రాష్ర్ట వైఎస్సార్ సీపీ సెక్రెటరీ ఎండీ సలీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం సూర్యపేట జిల్లా […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 6:32 pm
Follow us on

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో బుధవారం పర్యటించారు. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో పర్యటించి మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు సూర్యపేటల్లో తిరిగారు. సీనియర్ నేత నర్సిరెడ్డి ఇంట్లో అల్పాహారం చేశారు.

తర్వాత కరోనాతో మృతిచెందిన తెలంగాణ రాష్ర్ట వైఎస్సార్ సీపీ సెక్రెటరీ ఎండీ సలీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లే సరికి ఇంటికి తాళం వేసి ఉండటంతో అందరు ఆశ్చర్యపోయారు.

హైదరాబాద్ నుంచి పరామర్శించడానికి వస్తే ఇంటికి తాళం వేసి ఉండటంతో అందరు షాక్ కు గురయ్యారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. తండ్రితో కలిసి సాయి కోదాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లినట్లు చెప్పారు. షర్మిల వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, పోలీసులు నిన్న రాత్రి నీలకంఠ సాయి ఇంటికొచ్చి ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే సాయి కుటుంబం ఇల్లు వదిలి పోయినట్లు ఆరోపిస్తున్నారు. నీలకంఠ కుటుబాన్ని టీఆర్ఎస్ నేతలే వెళ్లగొట్టినట్లు వైఎస్సార్ సీపీ నేత రాంరెడ్డి పేర్కొన్నారు. సాయి ఇంటి ముందే షర్మిల నిరుద్యోగులతో మాట్లాడారు. దీనిపై ఇప్పటికే తెలంగాణలో చర్చ సాగుతోంది.