Lokesh KTR meeting: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరి అవసరం వారికి ఉంటుంది. సిద్ధాంతాల పరంగానే విభేదించుకుంటారు. అవసరం ఉన్నప్పుడు కలుసుకుంటారు, కలిసి పోటీ చేస్తారు. పొత్తు పెట్టుకుంటారు.. మద్దతు ఇచ్చుకుంటారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్. నాడు రాష్ట్ర విభజనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. దీంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కొý ుకు కేటీఆర్ టీడీపీని ఆంధ్రా పార్టీగానే చూశారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడును బుక్‌చేసి హైదరాబాద్ నుంచి పంపించారు. అప్పటి నుంచి టీడీపీ, టీఆర్‌ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో టీడీపీతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. కానీ, కేటీఆర్ ఇటీవల లోకేశ్‌ను రహస్యంగా కలిసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశాల వెనుక ఉద్దేశం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. ఈ ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Also Read: కవితక్కకు దారేది?
రహస్య భేటీలో నిజమెంత?
రేవంత్ రెడ్డి జులై 17న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ లోకేష్‌ను అర్ధరాత్రి సమయంలో రహస్యంగా కలిశారని ఆరోపించారు. ఈ సమావేశాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించినవా లేక ఆంధ్రా సెటిలర్స్ ఓట్లను ప్రభావితం చేయడానికి సంబంధించినవా అని ప్రశ్నించారు. అదనంగా, కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్‌లో డ్రగ్స్ వాడి మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులను తెలంగాణకు తెప్పించినట్లు చెప్పారు. ఈ ఆరోపణలు రాజకీయంగా కేటీఆర్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి, కానీ వీటికి ఆధారాలు లేవు.
కేటీఆర్ సవాల్..
కేటీఆర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జులై 18న ఒక ఇంటర్వ్యూలో, లోకేష్‌ను కలవలేదని, అవసరమైతే పట్టపగలు కలుస్తానని, లోకేష్ తనకు సోదరుడిలాంటి వ్యక్తి అని అన్నారు. రేవంత్ ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ చేసిన కేటీఆర్, ఈ వివాదాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అయితే రేవంత్ ఆరోపణలకు సమాధానంగా ఆధారాలు ఇంకా బహిర్గతం కాలేదు.
Also Read: బనకచర్ల ప్రాజెక్టు.. ఆ జలాలపై అభ్యంతరం ఎందుకు?
లోకేష్, కేటీఆర్ కలయిక ఎందుకు ముఖ్యం?
లోకేష్ (టీడీపీ), కేటీఆర్ (బీఆర్‌ఎస్) రెండు వేర్వేరు రాష్ట్రాలు, రాజకీయ భావజాలాలకు చెందిన నాయకులు. అయినప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సాంస్కృతిక, రాజకీయ సంబంధాలు ఇటువంటి సమావేశాల ఊహాగానాలకు ఆస్కారం ఇస్తాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు కీలకం కావడం, రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, రాజకీయ సహకార అవసరాలు ఈ ఆరోపణల వెనుక కారణాలుగా ఉండవచ్చు. అయితే, ఈ సమావేశాలు నిజంగా జరిగాయా లేక రాజకీయ ఎత్తుగడల కోసం సృష్టించబడిన కథనమా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
నేను నారా లోకేష్‌ను కలవలేదు
లోకేష్‌ను చీకట్లో కలిశాను అని రేవంత్ రెడ్డి గాలి గన్నయ్య మాటలు మాట్లాడుతున్నాడు
నేను ఏది చేసినా బాజప్తా చేస్తా బేజాప్తా చేయను
లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు ఒకవేళ కలిస్తే తప్పేంటి.. లోకేష్ ఏమైనా రేవంత్ రెడ్డి సంచులు మోసిన దొంగ… pic.twitter.com/TwZyJHRxm0
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2025