https://oktelugu.com/

Tollywood: ఈ పాప.. ఇప్పుడు యూత్ గ్లామర్ క్వీన్..ఎవరో గుర్తుపట్టండి..

టాలీవుడ్ ఇండస్టీలోకి ఇతర సినిమా ప్రపంచం నుంచి వచ్చిన భామలు ఎంతో మంది ఉన్నారు. కానీ నార్త్ నుంచి వచ్చిన వారు కొందరే. వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ బ్యూటీ న్యూ ఢిల్లీలో 1992 డిసెంబర్ 5న జన్మించింది. ముందుగా పంజాబీ లోని సీరియల్ ‘చన్నా మేరేయా’, ‘వీరే కి వెడ్డింగ్’ లల్లో నటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 20, 2024 / 12:31 PM IST

    Payal Rajputh

    Follow us on

    Tollywood:  సినిమాల్లో రాణించడం అంటే మామూలు విషయం కాదు.. అవకాశాలతో పాటు అదృష్టం ఉండాలి. కొందరు ఎన్నో సినిమాల్లో నటించినా గుర్తింపు రాదు. దీంతో సరైన అవకాశాలు ఉండవు. మరికొందరు మాత్రం ఒక్క సినిమాతో పాపులర్ అవుతారు. అయితే ఇలాంటి వారు కూడా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. టాలీవుడ్ కు చెందిన ఓ బ్యూటీకి ఫస్ట్ మూవీనే బెస్ట్ హిట్టించింది.దీంతో ఆ తరువాత అవకాశాల వరద పారుతుందని అనుకుంది. కానీ అనుకున్నట్లు జరగలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందంతో అలరిస్తోంది. వెస్ సీరీసుల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఎవరా గ్లామర్ కింగ్? ఇప్పుడేం చేస్తోంది?

    పై ఫొటోలో క్యూట్ గా ఉన్నబేబీని చూస్తే ఎవరికైనా ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటారు. అనుకున్నట్లుగానే ఆమెకు తెలుగులో మంచి హిట్టు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ అవుతారని అన్నారు. కానీ ఆ తరువాత అవకాశాలు రాలేదు. అడపా దడపా కొన్ని సినిమాల్లో నటించినా ఈ భామను పెద్దగా పట్టించుకోలేదు. అయితే తనకు హిట్టిచ్చిన ఫస్ట్ మూవీలో ఈ బ్యూటీ అందాల వరద పారించింది. యూత్ గ్లామర్ క్వీన్ గా మారింది.

    payal rajputh 2

    టాలీవుడ్ ఇండస్టీలోకి ఇతర సినిమా ప్రపంచం నుంచి వచ్చిన భామలు ఎంతో మంది ఉన్నారు. కానీ నార్త్ నుంచి వచ్చిన వారు కొందరే. వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ బ్యూటీ న్యూ ఢిల్లీలో 1992 డిసెంబర్ 5న జన్మించింది. ముందుగా పంజాబీ లోని సీరియల్ ‘చన్నా మేరేయా’, ‘వీరే కి వెడ్డింగ్’ లల్లో నటించారు. ఆ తరువాత 2018లో తెలుగులో ‘ఆర్ ఎక్స్ 100’ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తెలుగులో ఎంతో కాలం వేచి చూసినా ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో మళ్లీ సొంత ఇండస్ట్రీకి వెళ్లి నటించింది.

    ఇలా కొన్నాళ్ల తరువాత మళ్లీ తెలుగులో సీత, వెంకీ మామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి వంటి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇదే సమయంలో తమిళం, కన్నడ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే వీటిల్లో ఫస్ట్ మూవీ ఇచ్చిన హిట్టు మరే మూవీ ఇవ్వలేదు. దీంతో ఈ భామ స్టార్ నటిగా మారలేదు. ప్రస్తుతం ‘గోల్ మాల్, ఏంజెల్, కితతక అనే సినిమాల్లో నటిస్తోంది. సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అందచందాలతో కనిపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది.