HomeNewsLavanya Tripathi: ఇది చాలా బాధాకరమైన సంఘటన - లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: ఇది చాలా బాధాకరమైన సంఘటన – లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: ‘లావణ్య త్రిపాఠి’ మంచి నటి.. అందులో ఎలాంటి అనుమానం లేదు. పైగా అందంలో అమ్మడు అదిరిపోతోంది. కాలం కలిసి రాక ఏవరేజ్ హీరోయిన్ గా మిగిలిపోయింది గానీ, ఏ మాత్రం ఛాన్స్ ఉన్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ, ఆమె అలా కాలేదు కదా. అందుకే, అమ్ముడు ఆడియన్స్ కి బాగా లోకువ అయిపోయింది.

ఇంతకీ, విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో మతమార్పిడికి బలవంతం చేస్తే.. లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వార్త. దాంతో ఈ ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు. కాకపోతే, కొందరు నెటిజన్లు తెలియక.. లావణ్య పేరుకు బదులుగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అనే పేరును హ్యాష్‌ ట్యాగ్‌ గా వాడుతున్నారు.

Also Read: ఎక్స్ గ్రేషియా వ‌ద్దు.. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల్సిందే..

ఇది గమనించిన ఓ నెటిజన్‌ ‘లావణ్య త్రిపాఠి అనే హ్యాష్‌ ట్యాగ్‌ తప్పు. లావణ్య తమిళనాడుకు చెందిన సాధారణ దళిత అమ్మాయి. ఆమె పేరును వాడండి. ఇక లావణ్య త్రిపాఠి ఒక సాధారణ చౌకబారు నటి. ధర్మం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఒక గొప్ప స్త్రీ మూర్తి అయిన లావణ్యను.. డబ్బు కోసం దిగజారిపోయే హీరోయిన్‌తో పోల్చకండి’ అంటూ ఆ నెటిజన్ కామెంట్స్ చేశాడు.

అయితే, ఈ కామెంట్స్ పై లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందిస్తూ.. ‘నీలాంటి నీచమైన వాళ్లు ఎక్కువుగా అమ్మాయిల గురించి చీప్‌ గా మాట్లాడతారు. కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు. ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో! ఇది చాలా బాధాకరమైన సంఘటన. కానీ సమాజంలోని వాస్తవ పరిస్థితి ఇదే!’ అని తనదైన శైలిలో లావణ్య పోస్ట్ చేసింది.

Lavanya Tripathi
Lavanya Tripathi

అభినయంలో మంచి ప్రతిభ ఉన్న నటి. పైగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి. అయితే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఈ బ్యూటీ సినీ కెరీర్. గొప్ప టాలెంట్ ఉన్నా, కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఎందుకో హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించలేకపోయింది. తనను దర్శకనిర్మాతలు, అలాగే స్టార్ హీరోల పెద్దగా ఆదరించక పోవడానికి కారణాలు వెతుక్కుంది.

ఆ వెతుకులాటలో ఆమెకు దొరికిన మెయిన్ పాయింట్. స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే.. ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం పడకూడదని తెలుసుకుంది. మొత్తానికి ముప్పై ప్లస్ లోకి వచ్చాక గాని, లావణ్య త్రిపాఠికి తత్వం బోధపడలేదు. మొదట్లో ఎక్స్ పోజింగ్ చెయ్యను అంటూ ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చి వచ్చే ఛాన్స్ లను చెడగొట్టుకుంది.

చివరికి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ? ఇప్పుడు తీరిగ్గా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి కిందామీదా పడుతుంది. తన గ్లామర్ సొగసులను అడ్డు అదుపు లేకుండా ఆరబోస్తూ వరుస ఫోటోషూట్ లు చేస్తూ ఆ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. పైగా ఈ మధ్య లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రెగ్యులర్ గా ఫోటోలను పోస్ట్ చేస్తూ ముందుకు పోతుంది.

Also Read: బడ్జెట్ ఎఫెక్ట్: ఈ వస్తువుల ధర పెరుగును.. వీటి ధర తగ్గును..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version