Union Budget Of India 2022: మనదేశంలో సుదీర్ఘ కాలంగా నదుల అనుసంధానికి సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల ద్వారా నదుల అనుసంధానానికి సంబంధించిన తొలి అడుగు పడుతోంది.ఈ నేపథ్యంలోనే నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి చర్చ జరగాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లో కెన్-బెత్వా ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.44,605 కోట్ల వ్యయం కానుంది. కాగా, కేంద్రం రూ.1,400 కోట్లు కేటాయించింది.
అలా కెన్-బెత్వా ప్రాజెక్టుకు తొలి అడుగులు అయితే పడుతున్నాయి. ఈ రెండు నదులు కూడా మధ్యప్రదేశ్ లో పుడతాయి. కాగా, ఇవి ఉత్తర ప్రదేశ్ లోని యమునా నదిలో కలుస్తాయి. కెన్ నదిలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ నదిలోని నీటిని బెత్వాలో కలిపినట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయి. అలా ఈ రెండు నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి అయితే కనుక ఉభయ రాష్ట్రాల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి ప్రయోజనాలు చేకూరుతాయి.
Also Read: Union Budget Of India 2022: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!
ఇకపోతే దేశంలో నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులు కెన్-బెత్వా మాత్రమే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. దమన్ గంగ- పింజల్, గోదావరి -కృష్ణ, పెన్నా-కావేరి, కృష్ణ-పెన్నా, పార్ -తాపి- నర్మద, ఇలా ప్రాజెక్టులు ఉండగా వీటికి సంబంధించిన డీపీఆర్ లను అధికారులు సిద్ధం చేయనున్నారు.
గోదావరి – కృష్ణ నదులకు సంబంధించి పరివాహక రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కాగా, పెన్నా నది ఆంధ్రప్రదేశ్ లో ఉండగా, కావేరి పరివాహక ప్రాంతం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. ఈ నేపథ్యంలో పరివాహక రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయనున్నారు. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత పనులను కేంద్రం ప్రారంభించనుంది. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానం జరగాలంటే మొదలు నీటి లభ్యత తేల్చాల్సి ఉంటుంది. గోదావరి నీటి లభ్యత తెలిపి అనుసంధాన ప్రక్రియ షురూ చేయాలని ఇంతకు మునుపే తెలంగాణ కేంద్రాన్ని కోరింది. కాగా, ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నదుల అనుసంధానం వలన తమ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా చూడాలని కేంద్రానికి ఏపీ కూడా సూచించింది. చూడాలి మరి.. ఈ అనుసంధాన ప్రక్రియ స్టార్ట్ కావడానికి ఎంత టైం పడుతుందో..
Also Read: Union Budget Of India 2022: అసలైన విషయాలపై కేంద్రానికి సోయిలేదు.. బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్..