https://oktelugu.com/

Prabhas Fauji: సెట్స్ మీదకి వెళ్లకుండానే భారీ ఆఫర్ ను దక్కించుకున్న ప్రభాస్ ఫౌజీ…

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక మన స్టార్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో రికార్డులను క్రియేట్ చేయడం వల్ల తెలుగు సినిమా స్థాయి అనేది రోజురోజుకు పెరుగుతూనే వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 12:17 PM IST

    Prabhas Fauji(1)

    Follow us on

    Prabhas Fauji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఇక ఆ ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడి అటెన్షన్ ఆ సినిమా మీదనే ఉంటుంది. మొదటి రోజే సినిమా చూడడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే మొదటి రోజు ఈ సినిమాను చూసి ఆనందపడే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్, సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ లో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ అనే సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆగస్టులో ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తాన్ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయినప్పటికి ఈ సినిమా సెట్స్ మీదికి ఎప్పుడు వెళ్తుంది అనేదానిమీద చాలా రకాల ప్రశ్నలైతే తెలుస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సోల్జర్ గా నటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది…

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి కూడా వెళ్లలేదు అప్పుడే ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక భారీ ఆఫర్ అయితే వచ్చింది. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ రైట్స్ కోసం 150 కోట్లు రూపాయలను ఆఫర్ చేసింది. దీనిని సినిమా యూనిట్ ఇంకా యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపించడం లేదు. నిజానికి 150 కోట్లు అనేవి ప్రభాస్ సినిమాకి చాలా తక్కువనే చెప్పాలి.

    ఇంతకుముందు సలార్ సినిమా హిందీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్160 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించారు. ఇక ఇప్పుడు దానితో పోల్చుకుంటే ప్రభాస్ స్టార్ డమ్ ఇంకా పెరిగింది. కల్కి సినిమాతో 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక భారీ కలెక్షన్లను కొల్లగొట్టడంలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరనేంతల గుర్తింపు నైతే సంపాదించుకున్నాడు.

    ఇక ప్రస్తుతం ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయాక ఓటిటి గురించి ఆలోచిద్దామనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఇంత మొత్తంలో భారీ ఆఫర్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి… ఇక ఈ సినిమాతో కూడా సక్సెస్ ని అందుకుంటే ప్రభాస్ స్టార్ డమ్ ను అందుకునే హీరోలు ఎవరు ఉండరనే చెప్పాలి…