https://oktelugu.com/

Lok Sabha Election 2024: దేశంలో హ్యాట్రిక్‌ సీఎంలు.. పీఎంలు వీరే..

దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉంది. సుమారు 24 ఏళ్లపాటు పవన్‌కుమార్‌‡ సీఎంగా పనిచేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. 1994 డిసెంబర్‌ 5న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చామ్లింగ్‌.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 2, 2024 / 05:45 PM IST

    Lok Sabha Election 2024

    Follow us on

    Lok Sabha Election 2024: దేశంలో పలువురు నేతలు ముఖ్యమంత్రులుగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు. వరుగసా మూడు దఫాలుగా ముఖ్యమంత్రి పీటం అధిష్టించారు.. సిక్కిం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గడ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హ్యాట్రిక్‌ సీఎంలు ఉన్నారు.

    ఎక్కువ సార్లు సీఎం అయిన పవన్‌ కుమార్‌..
    దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉంది. సుమారు 24 ఏళ్లపాటు పవన్‌కుమార్‌‡ సీఎంగా పనిచేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. 1994 డిసెంబర్‌ 5న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చామ్లింగ్‌.. 2019 మే 28 వరకు ఆ పదవిలో కొనసాగారు.
    పవన్‌ చామ్లింగ్‌ పేరిట ఉంది. 24 ఏళ్ల 165 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

    అదే బాటలో ఒడిశా సీఎం..
    ఇక పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ బాటలో ఇప్పుడు ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ ఉన్నారు. ఆయన సీఎంగా 23 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కొన్ని రోజుల్లో చామ్లింగ్‌ రికార్డును నవీన్‌పట్నాయక్‌ బ్రేక్‌ చేడయం ఖాయం అంటున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ దఫాలో ఆ రాష్ట్రంలో బీజేడీ అధికారంలోకి వస్తే చామ్లింగ్‌ రికార్డును నవీర్‌ అధిగమిస్తారు. 2000, మార్చి 5న ఒడిశా సీఎంగా నవీన్‌ మొదట ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు ఆయనే సీఎంగా ఉన్నారు.

    తర్వాతి స్థానంలో నరేంద్రమోదీ..
    ఇక నవీన్‌పట్నాయక్‌ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన సీఎం రికార్డు ప్రధాని నరేంద్రమోదీ పేరిట ఉంది. మోదీ 2001 అక్టోబర్‌ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 2002లో గుజరాత్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయంలో నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారు. 2002 డిసెంబర్‌ 22 నుంచి 2007 డిసెంబర్‌ 22 వరకు, 2007 డిసెంబర్‌ 23 నుండి 2012 డిసెంబర్‌ 20 వరకు, 2012 డిసెంబర్‌ 20 నుంచి 2014 మే 22వ తేదీ వరకు ఆయన సీఎంగా కొనసాగారు.

    షీలా దీక్షిత్‌..
    ఇక ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన జాబితాలో కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. 1998 డిసెంబర్‌ 3 నుంచి 2023 డిసెంబర్‌ 1 వరకు ఢిల్లీ సీఎంగా షీలాదీక్షిత్‌ పనిచేశారు. ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాక ఢిల్లీలో కాంగ్రెస్‌ డీలాపడింది. కాంగ్రెస్‌ పార్టీ స్థానాన్ని ఆప్‌ భర్తీ చేసింది.

    మాణిక్‌ సర్కార్‌..
    ఇక ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన సీఎంల జాబితాలో త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ 5వ స్థానంలో ఉన్నారు. ఆయన 1998 నుంచి 2018 వరకు త్రిపుర సీఎంగా పనిచేశారు. వరుసగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

    జ్యోతిబసు…
    ఇక ఆరో స్థానంలో పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం జ్యోతిబసు ఉన్నారు. ఆయన ఆ రాష్ట్రానికి ఎక్కువ కాలం పనిచేసిన సీఎం. 1977 జూన్‌ 21 నుంచి 2011 మే 13 వరకు బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో అప్పటి ఉప ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్యకు సీఎం పదవిని అప్పగించారు. బెంగాల్‌ సీఎంగా జ్యోతిబసు 23 ఏళ్ల, 137 రోజుల పాటు ఆయన సీఎంగా పనిచేశారు.

    ప్రధాని పదవి వదులకున్న బసు..
    కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే సమయంలో జ్యోతి బసును ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని యునైటెడ్‌ ఫ్రంట్‌ లోని పార్టీలు కోరాయి. అయితే పార్టీకి పూర్తిస్తాయి ఎంపీలు లేనందున ప్రధాని పదవిని తీసుకోవద్దని సీపీఎం తేల్చి చెప్పింది. పార్టీ పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. దీంతో జ్యోతిబసు ప్రధాని పదవిని తిరస్కరించారు.

    శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌..
    మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్‌చైహాన్‌ మూడు దఫాలు సీఎం పదవి దక్కించుకున్నారు. 2005 నుంచి 2016 వరకు వరుసగా మూడు దఫాలు విజయం సాధించారు.

    రమణ్‌సింగ్‌..
    ఇక ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ కూడా వరుసగా మూడు దఫాలు సీఎం పదవిలో కొనసాగారు. 2003 డిసెంబర్‌ 7 నుంచి 2018 డిసెంబర్‌ 17 వరకు మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

    చంద్రబాబు నాయుడు..
    ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రెండు పర్యాయాలు వరుసగా, మరో పర్యాయం సీఎంగా పని చేశారు. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2014లో విభజిత ఆధ్రప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు.

    కేసీఆర్‌..
    ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జాబితాలో ఆఖరు స్థానంలో ఉన్నారు. ఆయన 2014, 2018లో వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు.

    హాట్రిక్‌ ప్రధానులు..
    ఇక హ్యాట్రిక్‌ ప్రధానులుగా 18 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దనే పనిచేశారు. స్వతంత్ర భారత దేశ మొదటి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వరుసాగా మూడుపర్యాయాలు ఆయన ప్రధానిగా పనిచేశారు. నెహ్రూ 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా కొనసాగారు. ఇందులో 1952, 1957, 1962 ఎన్నిల్లో వరుసగా గెలిచారు. ఇప్పటి వరకు ఆయన పేరిటే రికార్డు ఉంది.

    రికార్డు సమయం చేయనున్న మోదీ..
    ఇక నెహ్రూ రికార్డును మోదీ సమయం చేయనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. 2014లో పీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2019 ఎన్నికల్లోనూ మరిన్ని ఎక్కువ స్థానాలతో రెండోసారి ప్రధాని అయ్యారు. తాజాగా 2024 ప్లామెంటు ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలతో మోదీ ప్రధాని అవుతారని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటిస్తున్నాయి. మోదీ ప్రధాని కావడం ఖాయం. అయితే సీట్లు ఎన్నివస్తాయి అనేదే సందిగ్ధం. ఈ ఉత్కంuý కు కూడా జూన్‌ 4న తెరపడుతుంది.