https://oktelugu.com/

Career: ప్రపంచంలోనే ట్రెండింగ్ కోర్సు ఇది.. నేర్చుకుంటే మీకు తిరుగుండదు.. సంపాదన లక్షల్లోనే

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం. దీంతోనే అన్ని రంగాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో తమ ఉద్యోగాలు పోతాయనే భయం ఒకవైపు చాలా మంది నిపుణులు, మరోవైపు ఏఐపై పట్టు సాధిస్తేనే గొప్ప ఉద్యోగం వస్తుందని కూడా చెబుతున్నారు

Written By:
  • Rocky
  • , Updated On : December 25, 2024 / 08:58 PM IST

    Artificial Intelligence Course

    Follow us on

    Career: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం. దీంతోనే అన్ని రంగాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో తమ ఉద్యోగాలు పోతాయనే భయం ఒకవైపు చాలా మంది నిపుణులు, మరోవైపు ఏఐపై పట్టు సాధిస్తేనే గొప్ప ఉద్యోగం వస్తుందని కూడా చెబుతున్నారు. AI అనేది భవిష్యత్ సాంకేతికత అని స్పష్టమైంది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి AIఅధునాతన భావనలకు ఇప్పటికే చాలా డిమాండ్ ఉంది. అగ్రదేశాలైన అమెరికా, చైనా, జపాన్‌, యూరప్‌ వంటి వాటి మాదిరిగానే ఇప్పుడు భారత్‌లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బాగా పాపులర్ అయింది. ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లలో ఇప్పుడు రోబోలు కస్టమర్లకు ఆహారం సర్వ్ చేస్తున్నాయి. బీటెక్‌లో పెట్రోలియం, సివిల్, మెకానికల్ వంటి బ్రాంచీలకు బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కూడా విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అనేక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఏఐ కోర్సులు అందిస్తున్నాయి.

    టెక్నాలజీ ప్రతిరోజూ కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన జీవనశైలిలో భాగం అయిపోయింది. AI నిపుణులకు ప్రస్తుతం డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకోవాలని, దానిని తమ నిత్య జీవితంలో ఉపయోగించాలని భావిస్తున్నారు. కరోనా కాలం (AI జాబ్స్) నుండి ఏఐ డిమాండ్‌లో విపరీతమైన పెరుగుదల ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా కెరీర్ లో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో AI కెరీర్ ఎంపికల పరిధి ఇప్పటికంటే మూడు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి?
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డేటా మేనేజ్‌మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, రోబోటిక్స్, మ్యాథమెటిక్స్ మొదలైన ఇంజనీరింగ్‌లోని వివిధ శాఖలను కలపడం ద్వారా AI కోర్స్ క్రియేట్ చేయబడింది. ఇందులో వివిధ పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ప్రతిదీ ఈ డేటాపై ఆధారపడి ఉంటుంది. డేటా తప్పుగా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సరిగ్గా పని చేయదు.

    AI కోర్సులు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కోర్సులు
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిలబస్ అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది.
    1- మెషిన్ లెర్నింగ్, ఏఐలో పీజీ ప్రోగ్రాం – ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) బెంగళూరు, IIT ముంబై
    2- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్ – IIIT హైదరాబాద్
    3- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ – గ్రేట్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్, గురుగ్రామ్
    4- ఫుల్ స్టాక్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ – జిగ్సా అకాడమీ, బెంగళూరు
    5- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ – మణిపాల్ ప్రోలెర్న్, బెంగళూరు

    ఏఐ కోర్సులను కూడా ఉచితంగా చేయవచ్చు. దీని బేసిక్స్ నేర్చుకున్న తర్వాత, మీరు అధునాతన కోర్సులు కూడా చేయవచ్చు.
    1- IIT ఖరగ్‌పూర్, ఢిల్లీ, ముంబై, కాన్పూర్, మద్రాస్, గౌహతి, రూర్కీ (www.iit.ac.in)
    2- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (www.iisc.ernet.in)
    3- నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ (www.nsit.ac.in)
    4- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS), పిలానీ (www. bits-pilani.ac.in)
    5- CAIR (సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్), బెంగళూరు
    6- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూర్ (www.nie.ac.in)
    7- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రయాగ్‌రాజ్ (www.iiita.ac.in)
    8- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (www.uohyd.ac.in)

    జీతం ఎంత ఉంటుంది ?
    ఏఐ ఇంజనీర్లకు ప్రస్తుతం మన దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. ఏఐ కోర్సు చేయడం ద్వారా అమెరికా, చైనా, జపాన్ తదితర దేశాల్లో ఉద్యోగాలు సాధించవచ్చచు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ప్రారంభ వేతనం నెలకు రూ.50-60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. భారతదేశంలో ఏఐ నిపుణులు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో పని చేయవచ్చు. పెరుగుతున్న అనుభవంతో సంవత్సరానికి రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు జీతం తీసుకోవచ్చు.