War 2 Movie : #RRR, దేవర వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. హ్రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో ఉంటాయట. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్. వార్ చిత్రం లో హ్రితిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించాడు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ‘వార్ 2’ మూవీ కి సంబంధించిన పూర్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై వైరల్ గా మారింది.
స్టోరీ విషయానికి వస్తే కబీర్ సింగ్ (హ్రితిక్ రోషన్) కోవర్ట్ ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ కి లీడ్ బాధ్యతలు చేపడుతాడు. ఇండియా కి వీరేంద్ర రఘునాథ్ (ఎన్టీఆర్) నుండి భారీ ముప్పు వాటిల్లుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఒకప్పుడు వీరేంద్ర భారత దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేంత స్థాయి RAW ఏజెంట్. కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీం లోని శత్రుదేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వెళ్ళినప్పుడు, వీరేంద్ర కి వెన్నుపోటు పొడిచి, శత్రువులకు వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ నుండి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలను సైతం ఇవ్వాలనుకున్న తనని ఇంత దొంగ దెబ్బ తీస్తారా అనే కసితో టెర్రరిస్ట్ గా మారిపోతాడు. ముఖ్యంగా కబీర్ సింగ్ తనని వెన్నుపోటు పొడిచాడని అనుకోని అతని మీద తీవ్ర స్థాయిలో పగ పెంచేసుకుంటాడు.
కానీ వీరేంద్ర కి ఇంత అన్యాయం జరిగింది అనే విషయం తెలియదు. మరి వీరేంద్ర వాస్తవ నిజాలను తెలుసుకొని తాను సృష్టించిన టెర్రరిస్ట్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడా?, లేదా మూర్ఖంగా దేశద్రోహి గానే మిగిలిపోతాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా స్టోరీ లైన్ మొత్తం విన్న తర్వాత మీ అందరికీ పఠాన్ మూవీ స్టోరీ లైన్ గుర్తొచ్చి ఉంటుంది. అందులో కూడా జాన్ అబ్రహం ని ఇలా సొంత దేశానికి చెందిన వాళ్ళే మోసం చేయడంతో పగతో టెర్రరిస్ట్ గా మారిపోతాడు. అదే తరహా స్టోరీ లైన్ ఇందులో కూడా ఉంది. స్టోరీ లైన్ ఒకటే అయినా స్క్రీన్ ప్లే వేరు గా ఉంటుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ విషయం లో భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్టీఆర్ ని నెగటివ్ రోల్ లో చూపిస్తే అభిమానులు తీసుకోగలరా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.