Bobby Deol : యానిమల్’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటుడు బాబీ డియోల్. ఈయన లెజండరీ బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కుమారుడు. ఇతని అన్నయ్య సన్నీ డియోల్ బాలీవుడ్ లో ఒకప్పుడు పెద్ద సూపర్ స్టార్. రీసెంట్ గా ఆయన ‘గద్దర్ 2’ తో మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. బాబీ డియోల్ కూడా ఒకప్పుడు హీరోగా వాళ్ళ అన్నయ్య రేంజ్ లో కాకపోయినా, ఒక మోస్తారు మార్కెట్ ని సంపాదించుకొని కొనసాగాడు. ఇప్పుడు హీరో గా ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అవ్వడంతో, విలన్ గా ‘రేస్ 3 ‘ చిత్రంతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకొని దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో బాబీ డియోల్ మన ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు.
ఈ చిత్రం తర్వాత తెలుగు లో ఆయన ‘డాకు మహారాజ్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు చేసాడు. వీటిలో ‘డాకు మహారాజ్’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిల్చింది. ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో గా ఉన్నప్పుడు బాబీ డియోల్ పెద్దగా సంపాదించింది ఏమి లేదు కానీ, విలన్ గా మారిన తర్వాత మాత్రం భారీగానే సంపాదించాడని బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. ‘యానిమల్’ చిత్రం తర్వాత ఈయన మూడు సినిమాలు చేసాడు. మరో మూడు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాడు. మొత్తం మీద 7 సినిమాలకు గాను దాదాపుగా 66 కోట్ల రూపాయిలను సంపాదించాడట. అంటే ఆయన డిమాండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు బాబీ డియోల్ కి ఇంత సంపాదన ఉండేది కాదు. ఆయన భార్య తాన్య మంచి ఆస్తిపరురాలు. ఈమె ప్రముఖ పారిశ్రామికవేత్త దేవేంద్ర అహూజా కుమార్తె. 1996 వ సంవత్సరం లో తాన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బాబీ డియోల్. తాన్య తనతో పాటు 300 కోట్ల రూపాయిల ఆస్తిని కూడా తీసుకొచ్చింది. ఈ దంపతులిద్దరికీ ఆర్యమాన్, ధరమ్ అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అంతే కాదు తాన్య కూడా బాబీ డియోల్ తో సమానంగా సంపాదిస్తుంది. ఈమె ముంబై లో ఒక పాపులర్ ఇంటీరియర్ డిజైనర్. బాబీ డియోల్ కి సక్సెస్ లేక, అవకాశాలు తగ్గినప్పుడు భార్య తాన్య సంపాదన మీదనే ఇల్లు నడిచేది. ఈ కుటుంబం మొత్తం ముంబై ఆరు కోట్ల రూపాయిల విలువ చేసే అందమైన ఇంట్లో నివసిస్తున్నారు.