UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికార పార్టీ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ రాష్ర్టంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఢీకొనేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎదుటి పార్టీలను దాటుకుని విజయం సాధించాలంటే పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసమే యోగి శక్తియుక్తులు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుండటంతో దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని విజయ మార్గంలో నడిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానినై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో యోగి ఆదిత్య నాథ్ అయోధ్య నుంచి పోటీ చేయడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. యూపీలో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. సమర్థులైన అభ్యర్థుల ఎంపిక కోసమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ.. – సినిమా ఎలా ఉందంటే.. ?
ఈ క్రమంలో యూపీలో మారుతున్న రాజకీయ పరిణామాల సందర్భంలో అధికారం అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకే ప్రతిపక్షాలను ఎదుర్కొనే క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎందుకంటే యూపీలో విజయం సాధించాలంటే రాజకీయ, మతపరమైన, స్థానిక అంశాలు కలిసి రావాలి. దీని కోసం యోగి ఆదిత్యనాథ్ పలు కోణాల్లో దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ప్రత్యర్థులను ఎదుర్కొనే వారిని ఎంచుకున్నట్లు సమాచారం.
బీజేపీకి అవధ్ ప్రాంతంలో గోండా, బలరాంూర్, బహైచ్, బారాబంకి, అయోధ్య, సంత్ కబీర్ నగర్, కుషీనగర్ లపై పట్టు ఉంది. దీంతో యోగి ఆదిత్య నాథ్ అయోధ్య నుంచి పోటీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ కోసం అయోధ్య ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా తన సీటును త్యాగం చేయనున్నారు. యోగి అయోధ్య నుంచి పోటీ చేస్తే విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు.
Also Read: నాగార్జున డబుల్ రోల్.. రొమాన్స్ కూడా డబుల్ అంటేనే కష్టం !