Sankranti 2022 Telugu Movies: తెలుగు తెరకు సంక్రాంతి సీజన్ అంటే మహా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ సీజన్ లోనే పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ అవుతాయి. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా అన్నీ పెద్ద సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి. దాంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా లెక్కకు మించి చిన్న సినిమాలు ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధం అయ్యాయి.

మరి ఆ సినిమాల లిస్ట్ ఏమిటో ఒకేసారి చూద్దాం.
నాగార్జున- బంగార్రాజు – జనవరి- 14,
సిద్ధూ- DJ టిల్లు – జనవరి- 14,
అశిష్- రౌడీ బాయ్స్ – జనవరి- 14,
కల్యాణ్ దేవ్- సూపర్ మచ్చి – జనవరి- 14,
విశాల్- సామాన్యుడు – జనవరి- 14,
దుల్కర్ సల్మాన్- సెల్యూట్ – జనవరి- 14,
అశోక్ గల్లా- హీరో – జనవరి- 15.
సుమంత్ అశ్విన్ – 7 డేస్ 6 నైట్స్ – జనవరి- 15.

మొత్తమ్మీద సంక్రాంతికి పెద్ద చిత్రాలన్నీ వాయిదా పడటంతో ఉన్నవాటిలో పెద్ద సినిమాగా బంగార్రాజు విడుదలకు రెడీ అయ్యాడు. అయితే ఆంధ్రాలో ఇప్పుడీ చిత్రానికి ఓ అడ్డంకి ఎదురైంది. అందుకు కారణం నాగార్జున వ్యాఖ్యలే. ఇటీవలి చిత్ర ప్రచారంలో ఆంధ్రాలో టికెట్ రేట్లు సమంజసమే అన్నట్టు మాట్లాడారు నాగార్జున. దీంతో ఈస్ట్ గోదావరి, కాకినాడ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు నాగార్జున చిత్రాన్ని బహిష్కరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: మహేష్ కోసం ఫ్యాన్స్ పూజలు, హోమాలు.. వైరల్..!
ఒకవేళ నాగార్జున బంగార్రాజు రిలీజ్ పోస్ట్ ఫోన్ అయితే, మిగిలిన పెద్ద సినిమాగా ‘రౌడీబాయ్స్’ రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
ఏది ఏమైనా సంక్రాంతి జాతరలో పోటీ ఎక్కువగానే ఉంది. కానీ నిజంగా పోటీ ఇచ్చే పుంజే లేదు. అన్ని ఉప్మా సినిమాలే. కాబట్టి, జనం థియేటర్స్ ఎంతవరకు వస్తారు అనేది డౌటే.
Also Read: ఎన్నో ఏళ్ళ పూజాహెగ్డే కోరికను నెరవేర్చిన ప్రభాస్..!