Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది పూజా హెగ్డే మాత్రమే. కనీసం ఆమెతో ఫోన్లో మాట్లాడాలన్న కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందేనని ఓ సినిమా ఫంక్షన్లో ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారంటే ఆమె ఎంత బిజీనో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆమె టాలీవుడ్లోని బడా స్టార్స్ పక్కన వరుసబెట్టి నటించేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో నటించింది. ‘రంగస్థలం’లో స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డే మరోసారి ‘ఆచార్య’ రాంచరణ్ కు జోడీగా నటిస్తోంది. ఈ మూవీ ‘నీలాంబరి’గా పూజా హెగ్డే కన్పించనుంది. ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ మూవీలో నటించింది. ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అలాగే పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీలోనూ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది.
పూజా హెగ్డే టాలీవుడ్లోని స్టార్ హీరోల అందరితో కలిసి నటించడంతో ఆమెతో వారికి మంచి ర్యాపో ఏర్పడింది. దీంతో వారంతా తమ సినిమాల్లో పూజా హెగ్డేను రిపీట్ చేస్తుండటంతో ఆమెకు అవకాశాలకు కోదవ లేకుండా పోయింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డేకు ఎప్పటి నుంచో విభిన్నమైన ప్రేమకథ చేయాలని కోరిక ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన కోరిక ప్రభాస్ తో నటించిన ‘రాధేశ్యామ్’తో తీరిపోయిందని చెప్పారు.
ఇంత వరకు తాను నటించిన క్యారెక్టర్లలో ‘రాధేశ్యామ్’ చాలా క్లిష్టమైనదని చెప్పుకొచ్చారు. ఇది ఒక పిరియాడికల్ మూవీ కావడంతో తన పాత్ర ప్రేరణ కోసం ఎంతో పరిశోధన చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. ఈ మూవీని వెండితెరపై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు.
కాగా ఈమూవీ జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా ఈచిత్రాన్ని చిత్రబృందం వాయిదా వేసింది. ప్రేమ-విధి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రోమాంటిక్ ప్రేమ కథ ఖచ్చితంగా యూత్ ను ఆకట్టుకుంటుందనే టాక్ విన్పిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మించారు. ‘రాధేశ్యామ్’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తున్నారు.