దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని  దర్శించుకొని బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీలో కొలువైన శ్రీ మహంకాళీ అమ్మవారి ఆలయం నుంచి ఏటా సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా వరుసగా 12 వ ఏట తెలంగాణ నుంచి బోనాలు సమర్పించేందుకు భక్తులు […]

Written By: Suresh, Updated On : July 18, 2021 2:22 pm
Follow us on

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని  దర్శించుకొని బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీలో కొలువైన శ్రీ మహంకాళీ అమ్మవారి ఆలయం నుంచి ఏటా సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా వరుసగా 12 వ ఏట తెలంగాణ నుంచి బోనాలు సమర్పించేందుకు భక్తులు విజయవాడకు వచ్చారు.